Jagan : పోసాని అరెస్ట్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

Jagan Comments : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థులను పథకం ప్రకారం జైలులో పెట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో నంది అవార్డుల విషయంలో పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయనపై 18 కేసులు పెట్టి నెల రోజులకు పైగా జైలులో ఉంచారని జగన్ విమర్శించారు. ఈ చర్యలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

TAGS