JAISW News Telugu

Jagan : జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Jagan : జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్ కు మార్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణరాజు గగతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ఏపీకి చెందిందని జగన్ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ బెంచ్ కు నివేదించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.

ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్లను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని బెంచ్ కు విచారణను బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలిచ్చారు. ఈపిటిషన్లను డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version