Pithapuram : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ కూటమి గెలుపు కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు. పవన్ కల్యాణ్ 23న పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. అదే రోజు కుప్పంలో చంద్రబాబు కూడా నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు. గోదావరి జిల్లాల్లో పవన్ నామినేషన్ రోజు జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు.
పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీలో నిలిచారు. పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని భావిస్తుంటే తమదే విజయమని వైసీపీ పోటీ ధీమా వ్యక్తం చేస్తోంది. జగన్ బస చేసే కాకినాడ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యం నింపాలని చూస్తున్నారు. నేతల మధ్య సమన్వయం పెంచి గెలుపునకు బాటలు వేయాలని చూస్తున్నారు.
జగన్ బస్సు యాత్ర ద్వారా మద్దతు కూడగట్టుకోవాలని చూస్తున్నారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగనుందని చెబుతున్నారు. రాజమండ్రి నగరంలో జగన్ బస్సుయాత్రకు మంచి స్పందన లభించింది. భీమవరం సభలో జగన్ తన హయాంలో చేసిన పనుల గురించి వివరించారు. పవన్ పై విమర్శలు చేశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేన అభ్యర్థి పోటీలో ఉన్న పిఠాపురం కాకినాడ పరిధిలోకి వస్తుంది.
ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ కూటములు గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. మూడు కూటములు తమ విజయం కోసం పరితపిస్తున్నాయి. దీంతో విజయం తమదంటే తమదని భావిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. టీడీపీ కూటమి విజయమే ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.
జగన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా చుడుతున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఇలా మూడు కూటముల పోటీలో ఎవరు బయట పడతారో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.