JAISW News Telugu

Jagan : రాజీకి జగన్ ప్రయత్నాలు.. బంధువుల గడపతొక్కుతున్న మాజీ సీఎం..

Jagan

Jagan

Jagan : వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య ఆస్తుల వాటాల అంశం వైఎస్‌ కుటుంబంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. నాలుగు రోజులు షర్మిల మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు, విజయమ్మ లేఖలు ఇలా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తల్లి, చెల్లి ప్రకటనలతో వైసీపీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని జగన్ ఆందోళనకు గురవుతున్నట్లు పులివెందుల వాతావరణాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్న జగన్‌.. కుటుంబ ఆస్తుల వాటాల పంపకం గండం నుంచి బయటపడే విషయమై మధనపడుతూ బంధువులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. జగన్‌ ఐదేళ్లలో ఇడుపులపాయ, పులివెందులకు ఎప్పుడు వచ్చినా బంధువుల ఇంటి గడప తొక్కిన దాఖలాలు లేవు. ఎవరినైనా ఆయనను కలవాలంటే జగన్‌ దగ్గరకు రావాల్సిందే. కానీ ఇప్పుడు తనకు అవసరం వచ్చిందని బంధువుల ఇళ్లకు వెళ్లి కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు వాటా కావాలని షర్మిల డిమాండ్, ఆమెకు మద్దతుగా విజయమ్మ నిలవడంతో జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి తప్పు చేస్తున్నారంటూ జగన్ పార్టీ తరఫున బహిరంగ లేఖను సైతం విడుదల చేయించారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనని ఆందోళనలో ఉన్నట్లు జగన్‌ సన్నిహిత వర్గాల ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజీ ప్రయత్నాలు..
పులివెందుల పర్యటనలో రెండో రోజు బుధవారం (అక్టోబర్ 30) జగన్‌.. తన క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్‌ మనోహర్ రెడ్డితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులతో గంటకు పైగా చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
విజయమ్మ లేఖపై దుమారం, భవిష్యత్ లోనూ విజయమ్మ దీనిపై మరింత మాట్లాడే అవకాశం ఉందనే ఆందోళనతో రాజీ కుదుర్చుకోవాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం అవినాష్‌ రెడ్డి పెద్దనాన్న వైఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లి అరగంట ఏకాంతంగా మాట్లాడినట్లు తెలిసింది. ఆస్తుల విషయంలో తల్లితో రాయబారం నెరిపే అంశంపై చర్చించినట్లు సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు సన్నిహితుల ఇళ్లకూ వెళ్లి వచ్చారు.

Exit mobile version