Galla Jayadev : ఎన్నికలకు ముందు గుంటూరు టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. అయితే రాజకీయాలకు ఎందుకు దూరం అవుతున్నాననే విషయాన్ని జయదేవ్ అప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని గల్లా జయదేవ్ అన్నారు. అప్పటి లోక్‌సభలో మాట్లాడుతూ… రాముడు 14ఏళ్ల వనవాసం తర్వాత తిరిగొచ్చినట్లు తానూ మళ్లీ రాజకీయాల్లో వస్తానని… ఈసారి మరింత బలంగా వస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తాత్కాలికంగా మాత్రమే దూరమవుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో తను కొనసాగాలనుకోక పోవడానికి ప్రధాన కారణం రెండు పడవలపై ప్రయాణించదలచుకోవట్లేదని చెప్పాడు.
అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపారవేత్తలు రాజకీయాల్లో భాగం కావాలని ప్రోత్సహిస్తారని.. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదని తన మనసులోని బాధను పంచుకున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాపారవేత్తలైన రాజకీయనేతలు మాట్లాడితే వారి కంపెనీలపై ప్రతీకార దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకున్నా రాజకీయ కారణాలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. అప్పటి లోక్ సభలో ఉన్న 20శాతం మంది వ్యాపారవేత్త పరిస్థితి ఇలాగే ఉందన్నారు.
వాస్తవానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనను తీవ్ర వేధింపులకు గురి చేసింది. అధికార మదంతో రెచ్చిపోయి ఓ వ్యాపారవేత్త అని చూడకుండా అ కారణంగా జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారు. నాలుగేళ్ల క్రితం జగన్ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. దాంట్లో గల్లా జయదేవ్ ఒంటి నిండా దెబ్బలతో కనిపించాడు. ఇలాంటి రాక్షస క్రీడ ఆడటం జగన్ కు చాలా ఇష్టం, ఎంపీ రఘురామ కృష్ణంరాజును కూడా తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే, కానీ టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితిని దీనంగా తయారు చేశారు జగన్. కేంద్ర మంత్రిగా ఉండాల్సిన మంచి మనిషిని హింసించి రాజకీయాల నుంచి తప్పుకునే లాగా చేశాడు. అంతేకాకుండా అమరరాజా ఫ్యాక్టరీని తెలంగాణా కు వెళ్లేలా చేశాడు.