JAISW News Telugu

Jagan : బీజేపీతో జగన్ డీల్.. టీడీపీ, జనసేనకే మేలు..జరిగేది ఇదే..

Jagans deal with BJP

Jagan’s deal with BJP

Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. వైసీపీ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను ప్రకటించడం పాటు ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల సన్నాహాక సభలు పెడుతోంది. వీటిలో క్యాడర్, నాయకులకు జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా సీట్ల పంపకాలను వేగంగా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు త్వరలోనే ఫైనల్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇక కూటమితో బీజేపీ కూడుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

అయితే టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరకూడదని జగన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అలాగని తాను ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో కూడా లేరు. ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇలా చేస్తే ఓ రాజ్యసభ సీటు ఇస్తానని బీజేపీకి ఆఫర్ ఇచ్చారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అమిత్ షాతో భేటీకి జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. అపాయింట్ మెంట్ ఫిక్స్ అవ్వగానే వెళ్తారు. అయితే జగన్ రెడ్డి ప్రయత్నాలు టీడీపీ, జనసేన పార్టీలకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఉన్నాయి.

బీజేపీతో కలిసి పోటీ చేయడం ఆ రెండు పార్టీలకు బేసిగ్గా ఇష్టం లేదు. కానీ సామరస్యపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం పొత్తుల విషయంలో ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ఏపీ బీజేపీ నేతలు పొత్తుల కోసం పట్టుదలగా ఉన్నారు. మరికొంత మంది వద్దని అంటున్నారు. వీరి మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. జగన్ రెడ్డిని బీజేపీ పెద్దలు నమ్మలేరు. అవసరానికే మద్దతు ఇస్తారని వారికి తెలుసు. రేపు ఏదైనా తేడా వస్తే రాహుల్ ను పీఎం చేయడమే తమ జీవిత లక్ష్యమని చెప్పి ప్లేటు ఫిరాయించినా చెప్పలేం. ఆ విషయంపై బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉంది.

ఇప్పుడు రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు అమిత్ షా.. జగన్ రెడ్డికి సమయం కేటాయిస్తే.. వైసీపీ విషయంలో బీజేపీ పాజిటివ్ గానే ఉందనుకోవాలి. రాజ్యసభ సీటును తీసుకుంటే.. ఇక చెప్పాల్సిన పని లేదు. హ్యాపీగా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించుకుని జనంలోకి వెళ్లిపోతాయి. దీన్ని బట్టి చూస్తే టీడీపీ, జనసేన కూటమి సమస్యలను జగన్ రెడ్డి పరిష్కరిస్తున్నారని చెప్పవచ్చు.

Exit mobile version