CM Jagan : ఆయన ‘మ్యారేజ్ స్టార్’ అంటూ సిద్ధం సభలో జగన్ కామెంట్..

CM Jagan
CM Jagan : వైసీపీ అధినేత, సీఎం జగన్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి వివాదాస్పద కామెంట్ చేశాడు. గతంలో జగన్ ‘నలుగురు పెళ్లాలు’ అంటూ పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయగా.. నాలుగో పెళ్లాం జగన్ అంటూ రీ కౌంటర్ ఇచ్చారు పవన్. దీంతో జగన్ తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి మరో కామెంట్ చేశాడు జగన్.
జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు వీలు చిక్కినప్పుడల్లా ఆయన్ను కించపరిచే పేర్లు పెట్టేందుకు వెనుకాడడం లేదు. సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు ‘మ్యారేజ్ స్టార్’ అని, ‘వంచకుడు’ అని పిలిచారు.
‘పవన్ కళ్యాణ్‌కు వివాహ వ్యవస్థపై గౌరవం లేదు. ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చే అలవాటు ఉంది మ్యారేజ్ స్టార్ కు. ఇతరులు కార్లను ఎలా మారుస్తారో అతను భార్యలను అలా మారుస్తాడు. అంటూ పవన్ కళ్యాణ్ పై జగన్ విరుచుకుపడ్డారు. పెళ్లి విషయంపై పవన్ ను టార్గెట్ చేశాడు జగన్.
వారం క్రితమే ‘సిద్ధం’ సభలో జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పెళ్లి విషయంపై విమర్శలు గుప్పించారు. మళ్లీ ఈ రోజు (మార్చి 14) ‘సిద్ధం’ సభా వేదికగా జగన్ తన స్పీచ్ ని పవన్ పెళ్లిళ్లపై ఫోకస్ చేసి మ్యారేజ్ స్టార్ అంటూ విరుచుకుపడ్డాడు. ప్రతిపక్ష నేత పెళ్లితో రాజకీయంగా సంబంధం లేని అంశాన్ని సీఎం టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
కొంత మంది రాజకీయ పరిశీలకులు ఈ అంశంపై స్పిందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను వ్యక్తి గతంగా ధూషించడం సరికాదని, ఆయన వివాహాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉందని, ఇలా చేస్తే ఇమేజ్ పోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.