Jagan Bankruptcy : అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ రెడ్డి సర్కార్ నట్టేట మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఓ వైపు ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ వాడుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఉన్న నిధులన్నీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇప్పుడు బటన్లు నొక్కిన వాటికి కూడా డబ్బులు జమ చేయలేకపోతున్నారు. అందుకే నొక్కాల్సిన బటన్లను పెండింగ్ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ పోతున్నారు. ఇప్పుడు అప్పులు తీసుకునే చాయిస్ కూడా లేదు. అదనంగా అప్పులు కావాలని కేంద్రాన్ని ప్రాథేయపడుతున్నారు. కేంద్రం అప్పు ఇస్తే గట్టెక్కుతుంది. లేకపోతే జగన్ రెడ్డి జీతాలు కూడా ఇవ్వలేదు.
కేరళ ప్రభుత్వానికి రూ.20వేల కోట్లు కూడా ఆర్బీఐ అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వలేదు. బాధ్యతాయుతంగా ఉండే అక్కడి ప్రభుత్వానికి ఏవేవో నిబంధనల పేరుచెప్పి అప్పులు కూడా పుట్టనీయడం లేదు. అయితే ఏపీకి ఇప్పటివరకూ 70వేల కోట్లు కేవలం ఆర్బీఐ ద్వారానే అప్పులు ఇచ్చారు. అత్యంత ఘోరమైన ఆర్థిక నిర్వహణ ఉన్న రాష్ట్రం ఏపీ. 70 వేల కోట్ల పెట్టుబడి వ్యయం నాలుగైదు శాతం కూడా లేదు. ఏడాది మొత్తానికి కేంద్రం ఇచ్చిన అనుమతి రూ.45 వేల కోట్లు. ఆరు నెలలకే ఇది పూర్తి చేశారు. అప్పట్నుంచి కేంద్రం ప్రతీనెలా అదనంగా ఇస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది. ఇస్తే మాత్రం జగన్ రెడ్డిని ఆదుకున్నట్లే.
అప్పు పరిమితి ముగిసినందున ఏవేవో సాకులు చెప్పి కేంద్రం అప్పులు ఇచ్చి ఆదుకోకపోతే జగన్ రెడ్డి నిండా మునిగిపోవడం ఖాయం. ప్రజలు ఆయనపై డబ్బుల కోసం తిరుగుబాటు చేస్తారు. జీతాలు కూడా ఇవ్వలేదని దుస్థితి వస్తుంది. అయితే ఇదంతా ఆయన చేసుకున్నదే. విచ్చలవిడిగా చేసిన ఖర్చులు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పాలన ఫలితమే. ఇప్పుడు కేంద్రం.. ప్రజల వైపు ఉంటుందా.. జగన్ రెడ్డి వైపు ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం జగన్ రెడ్డిని అప్పులిచ్చి ఆదుకుంటే.. టీడీపీ, జనసేన ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం కూడా దండగే అని చెప్పకతప్పదు.