Jagan Achievements : ఐదేండ్లలో జగన్ సాధించిన ఘనత ఏమిటంటే
Jagan Achievements : రాష్ట్రము విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు.ఆయన పరిపాలనను తిరస్కరిస్తూ వైసిపి అదినేత జగన్ మోహన్ రెడ్డి కి పట్టం కట్టారు.2019 ఎన్నికల అఫిడవిట్ లో జగన్ మీద 32 కేసులు ఉన్నట్టు వివరించారు. తన మీద ఉన్న కేసులకు సమానంగా ప్రతిపక్ష నేతలపై కూడా ఉండాలనే ఆలోచన జగన్ కు ఎవరు ఇచ్చారో ఏమోగానీ వాళ్లపై కూడా ఇంచుమించు తనమీద ఉన్నన్ని కేసుల సంఖ్యకు సమానంగా ఉండే విదంగా తన ఐదేళ్ల పరిపాలనలో సాధించిన ఘనత గా చెప్పుకుంటున్నారు రాజకీయ వర్గాలు.
2019 ఎన్నికల నాటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. 2019 నామినేషన్ పత్రంలో కూడా ఒక్క పోలీస్ కేసు కూడా లేదని తెలిపారు. కానీ తాజా ఎన్నికల నాటికీ పవన్ కళ్యాణ్ పై గడిచి ఐదేళ్ల కాలంలో ఆరు కేసులు నమోదయినాయి. ఈ ఆరు కేసులు కూడా జగన్ పరిపాలంలోనే నమోదు కావడం విశేషం. ఈ ఆరింటిలో మీడియా పై మాట్లాడింది ప్రభుత్వానికి నచ్చలేదని ఒక కేసు.సాక్షాత్తు సీఎం జగన్ మీద ఆరోపణలు చేసినందుకు రెండు కేసులు,కారు మీద ప్రయాణం చేసినందుకు ఒక కేసు, విజయవాడ,ఏలూరులో రెండు కేసులు, వలంటీర్ల మీద ఆరోపణలు చేసినందుకు మరో మూడు పోలీస్ కేసులు నమోదయినాయి.
కేవలం జనసేన నాయకుడు పవన్ మీదనే కాదు తెలుగుదేశం,జనసేన నేతల్లో ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టడమే,అరెస్టు చేయడమే ద్యేయంగా జగన్ ఐదేళ్ల పరిపాలనలో జరిగింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై 2019 నాటికి కేవలం రెండు కేసులు మాత్రమే ఉన్నాయి.జగన్ కు పట్టాభిషేకం అయ్యాక బాబుపై 22 పోలీస్ కేసులు నమోదు కావడం విశేషం.చివరకు కంద్రబాబుపై ఉన్న కోపంతో ఆయన కుమారుడు లోకేష్ పై కూడా కేసులు పెట్టడం జరిగింది.
మీ ప్రభుత్వం సాధించిన ఘనత ఏమిటంటే అభివృద్ధి,నిరుద్యోగ నిర్మూలన,ఉపాధి అవకాశాలు కల్పించడం,కొత్త పరిశ్రమలు స్థాపించడం చెప్పుకుంటారు.కానీ జగన్ ప్రభుత్వం ఏమి సాధించింది అంటే ప్రతిపక్ష నాయకుల్లో ఎవరు అనుకూలంగా లేకుంటే వారిపై ఉన్న పోలీస్ కేసులు ఎన్ని,ఇప్పుడు వారిపై మా ప్రభుత్వం ఎన్ని కేసులు పెంచింది అని చెప్పుకోడానికే అంటూ ప్రజల్లో చర్చ మొదలైనది.