Chandrababu : జగన్.. దేనితో మొదలెట్టావో.. దానితోనే నీ చరిత్ర ముగుస్తుంది
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని అనేక హామిలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చాడు.ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.ప్రజలను మరోసారి మోసం చేసి రెండోసారి అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారులు జగన్ తొక్కుతున్నాడు.జగన్ బాబు.. అధికారం రాగానే దేనితో మొదలెట్టావో.. దానితోనే నీ చరిత్ర ముగుస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపికచేశారు. అమరావతి రాజధాని ఏవిదంగా ఉండనుందో అని తెలిపే నమూనా గ్యాలరీని నిర్మించారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.ఆ నమూనాను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు.
ఈ సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగ స్పందించారు. ఈ సందర్బంగ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ పై తప్పుడు ప్రచారం చేసాడు జగన్. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం అమరావతిలోనే నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చాడు. ముఖ్యమంత్రి కాగానే మాట తప్పాడు.మడమ కూడా తిప్పాడు.అధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసాడు అంటూ చంద్రబాబు ఆరోపించారు.రాష్ట్రంలో మూడు రాజధానుల పేరిట జగన్ నాటకాలు ఆడాడు.ఐదేళ్లల్లో ఎక్కడ కూడా రాజధాని పూర్తి కాలేదు. అధికారంలోకి వచ్చి,రాగానే జగన్ కూల్చివేతలతో తన అభివృద్ధిని మొదలుపెట్టాడు.ఎక్కడ కూడా అభివృద్ధి కనబడుతలేదు. మూడు రాజధానుల ఏర్పాటంటూ మూడు ముక్కల ఆట ఆడుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు.
మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అసెంబ్లీలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు సంబందించిన బిల్లు పెడితే జగన్ ఆమోదించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని పక్కకుపెట్టాడు.అమరావతిలో రాజధాని నిర్మిస్తే వరదలు వస్తాయని, నిర్మించడానికి ఈ నేల అనుకూలంగా ఉండదని, ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తాయని తప్పుడు ప్రచారం చేసి రాజధాని నిర్మాణాన్ని జగన్ అడ్డుకున్నాడని చంద్రబాబు ఆరోపించాడు.రాజధాని నిర్మాణంలో జగన్ ఏమైనా సాంకేతిక నిపుణులకంటే తెలివిఉన్నోడా అంటూ ప్రశ్నించాడు.అసెంబ్లీలో ఆరోజు ఎందుకు ఒప్పుకున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసాడు.అమరావతి రాజధాని ని తరలించడానికి కూడా కారణాలు ప్రజలకు చెప్పాల్సిన భాద్యత కూడా జగన్ పైననే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
జగన్ పరిపాలించిన ఐదేండ్లలో ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైనది. ప్రభుత్వం ఆడిన చదరంగంలో ప్రజలు పావులుగా నలిగిపోయారు.ప్రజలు తిరస్కరిస్తుంటే ఇంకా మీరు మారడంలేదు. మీ బుద్ధి కూడా ఇంకా వంకరగానే ఉంది.వంకరగా తయారైన మీ బుద్దిని ప్రజలు సరిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.ఇంటికివెళ్ళే సమయం దగ్గరపడుతున్న సమయంలోనైనా మీ మెదడును చక్కబెట్టుకోండి. ఆంబోతులా విధ్వంసం చేస్తూ,పాములా విషం చిమ్ముతున్న మీ దుష్ట చర్యలను ఇకనైనా మానుకోండి. మీరు అధికారంలోకి వచ్చి,రాగానే దేనితో అయితే మొదలు పెట్టారో మీ పరిపాలనను దానితోనే మీ పరిపాలన ముగియడానికి సమయం దగ్గర పడింది అంటూ జగన్ ను చంద్రబాబు నాయడు తీవ్రంగా హెచ్చరించారు.