JAISW News Telugu

Kirak RP : ఎన్నికల తర్వాత జగన్ కు ఆ గతే పడుతుంది.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు..

Kirak RP

Kirak RP

Kirak RP : ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై జూన్ 1 దాక నిషేధం ఉన్నప్పటికీ అనధికారికంగా సోషల్ మీడియాలో వివిధ సర్వేలు, అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని జగన్ గెలుస్తాడని, మరికొన్ని కూటమే అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తున్నాయి. అయితే అసలైన విజేత ఎవరో జూన్ 4న మాత్రమే తెలియనుంది.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు..ప్రస్తుతం లండన్ లో పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన ప్రత్యర్థి పార్టీల నెటిజన్లు ఆర్పీని ఓ ఆటఆడుకుంటున్నారు. నువ్వు చెప్పినట్లు కూటమికి 145 సీట్లు వస్తే ఫర్లేదు..ఒకవేళ రాకపోతే నీ పరిస్థితి ఏంటని హెచ్చరిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, జూన్ 4 తారీఖున ఎవరి సత్తా ఏంటో చూద్దామని కౌంటర్ ఇస్తున్నారు. ఫలితాల తర్వాత నువ్వు కనిపిస్తావా.. తేడా కొడితే ఏపీలో నీ షాపు ఒక్కడి కూడా ఉండదని ఆర్పీకి వార్నింగ్ ఇస్తున్నారు.

కాగా, ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున విస్తృత ప్రచారం చేశారు ఆర్పీ. కూటమి ఎందుకు ఓటేయాలో తనదైన శైలిలో చెబుతూ దూసుకెళ్లారు. వైసీపీ నుంచి వచ్చిన విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అయితే ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అంతే యాక్టివ్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆర్పీ. చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ కూటమికి అనుకూలంగా, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.

Exit mobile version