Ganta Srinivasa Rao : ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చిన జగన్: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao : ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ప్రతిష్ఠను జగన్ దిగజార్చారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ విగ్రహం పెట్టించారని, యూనివర్సిటీని జగన్ పార్టీ కార్యాలయంగా వీసీ మార్చేశారన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు.

‘‘ఏయూ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేది. విద్యా ప్రమాణాల పరంగా ఎక్కడికి వెళ్లినా ఏయూ పట్టా అంటే చాలా విలువ ఇచ్చేవాళ్లు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యా ప్రమాణాలు పడిపోయి, ఎన్నడూ లేనంతగా నాణ్యత దిగజారిపోయేలా చేశారు. పవిత్రమైన విద్యా సంస్థను ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారు. రూ.కోట్ల నిధులను స్వాహా చేశారు. జగన్, దేవాలయంలాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన ఏ ఒక్కరినీ ఉపేక్షించలేదు’’ అని గంటా శ్రీనివాసరావు ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

TAGS