Jagan Vs Chandrababu : వృద్ధుడని చంద్రబాబును గేలి చేసిన జగన్.. ఆయనతో సమానంగా పని చేశారా?

Jagan Vs Chandrababu

Jagan Vs Chandrababu

Jagan Vs Chandrababu : చంద్రబాబు వృద్ధాప్యంలోకి వెళ్లారు.. ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ కాబోతున్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారంలో ఎంతగా అవహేళన చేశారో చూశాం. కానీ చంద్రబాబు ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉండేవారు. జగన్‌ మాత్రం తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు రావడం.. ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం మళ్లీ అందులోకే వెళ్లడం చేస్తుండేవారు.

3-4 నెలలుగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు ఇందులో భాగంగా పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపిక, బుజ్జగింపులతో క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నాయుడు మరో నెలన్నర మండుటెండల్లో ప్రచారం నిర్వహించారు. కానీ ఎండలకు భయపడిన జగన్ ఏసీ బస్సులో తిరుగుతూ ప్రచారాన్ని ‘మమ’ అనిపించేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత లండన్‌ వెళ్లి అక్కడే సేద తీరుతున్నారు. జగన్ వెళ్లిన తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు బుధవారం (మే 29) ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపు లేదంటే ఎల్లుండి విజయవాడ చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అమెరికా వెళ్తే.. ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ బొత్స వంటి సీనియర్ నేతలు వెటకారంగా మాట్లాడారు. ఇప్పుడు బాబు తిరిగి వచ్చాడు. మరి వారి నాయకుడు జగన్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు.! ఈసారి ఎన్నికలలో టీడీపీ కూటమి గెలుస్తుందని నేతలు ధీమాతో ఉన్నందున చంద్రబాబు విదేశీ యాత్రకు వెళ్తే.. అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. తమ అధినేత రాకతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహం నింపుకున్నాయి.

పోలింగ్‌ సరళి చూసినప్పటి నుంచి వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కేసుతో టీడీపీని ఎదురుదెబ్బ తీద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి దాని గురించి వారే రచ్చ రచ్చ చేసుకున్నట్లయ్యింది. వైసీపీ నేతల్లో ఇంత గందరగోళం, ఇంత ఆందోళన చెందుతున్న సమయంలో వారి అధినేత జగన్ విదేశాలకు వెళ్లి అక్కడే  కాలక్షేపం చేస్తున్నారు. చొక్కా చేతులు మడత పెట్టి ‘యుద్ధం’ ‘సిద్ధం’ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ విదేశాల్లోనే సేద తీరుతుంటే, వృద్ధుడని, రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నాడని చెప్పిన చంద్రబాబు అప్పుడే తిరిగి వచ్చి అంతిమ యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇద్దరిలో ఎవరు యువకుడు.. ఎవరు వృద్ధుడు?

TAGS