CM Jagan : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడిన ఎంతో దయిర్యంగా మాట్లాడేవారు. తాజా ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాటపడుతున్న అయన మాటల్లో దయిర్యంగా మాట్లాడలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది జనం నోటిలోంచి. ఇంతకు జగన్ మాటల్లో పస తగ్గిందా.? తనకు తాను నమ్మకం కోల్పోయి మాట్లాడుతున్నారా ? ఒకప్పుడు నా వెంట్రుకను ఎవరు కూడా పీకలేరు అని ఛాలంజ్ చేసిన అంత పెద్ద నాయకుడు ఇప్పుడు ఆత్మ పరిశోధనలో పడిపోయారు అనే అనుమానాలు కూడా ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని చెబుతున్న సీఎం జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటున్నారు ఆ రాష్ట్ర ప్రజలు. ఆదివారం ఎదో సాకు చెప్పారు తన అనుచరులకు. అదికూడా ఏమైనది సరూ అంటే అతకని కారణం చెప్పి తప్పించుకున్నారు. ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగానే ఓటమి తప్పదని తెలిసే విశ్రాంతి పేరుతో ప్రచారం చేయకుండా తప్పించుకున్నారా అనే గుసగుసలు మొదలైనాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం లో కూడా మునుపటి మాదిరిగా రాజకీయ చాతుర్యం కనిపించడంలేదు. ఎన్నికలు సజావుగా జరిగే నమ్మకం లేదని చెబుతున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు ప్రభుత్వం అయన చేతిలోనే ఉన్నప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చిందని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే అధికారులను ఉన్నపలంగా బదిలీలు చేపడుతున్నారని ఆరోపణలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రము విడిపోయిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ల అనంతరం ఎన్నికలు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఉన్నప్పటికినీ వైసీపీ నేతలు పెత్తనం చెలాయించారు. అధికారంలో లేకపోయినా ఉన్నంత పనిచేసి ఎన్నికల కమిషన్ పై ఆధిపత్యం చెలాయించారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా తప్పించారంటే వైసిపి నేతల తెలివి తేటలు ఎంత గొప్పవో చెప్పాల్సిన అవసరంలేదు. రాష్ట్ర పోలీస్ బాస్, నిఘా అధికారి, చీఫ్ సెక్రటరీ లను కూడా బదిలీ చేయించి అధికారికంగా తామే గొప్ప అని చెప్పకనే చెప్పేసారు. చంద్ర బాబు అనే నాయకుడు రాష్ట్రానికి ముఖ్య మంత్రి అనే విషయం కూడా పట్టించుకోకపోవడం శోచనీయం.