Lotus Pond : అచ్చొచ్చిన లోటస్ పాండ్‌ను పట్టించుకోని జగన్.. కారణం అదే!
Lotus Pond : వైఎస్ జగన్ రాజకీయాలకు బీజం పడింది లోటస్ పాండ్ నుంచే. తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత పార్టీ పెట్టి గత ఎన్నికల్లో గెలిచింది.. కాంగ్రెస్ మీద సవాల్ చేసింది ఏపీలో బలమైన నేత ఎదిగింది లోటస్ పాండ్ నుంచే. అప్పట్లో జగన్ కేరాఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా నడిచింది. 2019 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ని నిర్మించుకుని అందులోకి మకాం మార్చారు. ఏపీ సీఎం గా అయిదేళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. మధ్యలో లోటస్ పాండ్ వంక చూడలేదు. అయితే జగన్ సీఎం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు.
ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి మాజీ సీఎం అయ్యారు. జగన్ తిరిగి లోటస్ పాండ్ కే వెళ్తారని అంతా భావించారు. కానీ జగన్ ఓడిన తర్వాత కూడా అడుగు పెట్టనిది అక్కడికే. జగన్ హైదరాబాద్ కూడా వెళ్లలేదు. జగన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత యూకే టూర్ వెళ్లారు. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ విశ్రాంతి కోసం అని పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లారు. ఇపుడు సెకండ్ టైం ఆయన అక్కడికే వెళ్లారు. కానీ హైదరాబాద్ వైపు చూడలేదు. అంతే కాదు తనకు పొలిటికల్ గా కలసి వచ్చిన లోటస్ పాండ్ ని కూడా కన్నెత్తి చూడడంలేదు. దానికి కారణాలు ఏంటి అని చూస్తే లోటస్ పాండ్ తన తండ్రి హయాంలో నిర్మించినదని అంటున్నారు. అది ఉమ్మడి ఆస్తిగా ఉంది. అందుకే అక్కడ షర్మిల ఉంటోంది.
జగన్ తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి షర్మిలనే లోటస్ పాండ్ లో ఉంటోంది. ఆమె తన వైఎస్సార్టీపీ పార్టీని కూడా అక్కడే స్థాపించారు. రెండేళ్ల పాటు అక్కడే నడిపారు. ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన రాజకీయాలను నడుపుతున్నారు. ఆమె పూర్తిగా లోటస్ పాండ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని చెబుతున్నారు. అందుకే జగన్ హైదరాబాద్ కానీ లోటస్ పాండ్ కానీ అసలు ఊసే తలవడం లేదు అని అంటున్నారు.
అయితే బెంగళూరులో జగన్ ఏకంగా 27 ఎకరాలలో యెహలంక ప్యాలెస్ ని కట్టుకున్నారు. అది కట్టుకున్న తర్వాత జగన్ పట్టుమని పది రోజులు కూడా ఉండలేదని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ కి తీరుబాటు దొరికింది అని అంటున్నారు. అందుకే తాజాగా మరోసారి జగన్ బెంగళూరు వెళ్లారు అని అంటున్నారు. ఆస్తి గొడవల వల్లనే షర్మిలకు జగన్ మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ ఉమ్మడి ఆస్తి అయినా జగన్ ఆ వైపు తొంగి చూడడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు.