YS Sharmila : తల్లిని కూడా మోసం చేసిన ఘనుడు జగన్..డోసు పెంచిన షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila : రేపటితో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అభ్యర్థులే కాదు పార్టీల అధినేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండడంతో నేతలు స్ట్రాటజిక్ విమర్శలు చేస్తున్నారు. ఇక అన్నాచెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో జగన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయటపెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించపరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని.. డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరిందని జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోజురోజుకూ జగన్ షర్మిలపై చేస్తున్న విమర్శల దాడి పెరిగిపోతోంది. తాజాగా టీవీ 9 ఇంటర్వ్యూలో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో షర్మిల మీడియా ముందుకొచ్చారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

ఎంపీని చేస్తానని అమ్మకిచ్చిన మాటనే జగన్ నిలబెట్టుకోలేదు. ఆయన విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సంచలన విషయం బయటపెట్టారు. జగన్ రెడ్డి మానసిక స్థితిపై తనకు ఎంతో కన్సర్న్ ఉందని ఎద్దేవా చేశారు. ఈ మాటలు మాట్లాడుతూ షర్మిల విలపించారు. తన రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. జగన్ రెడ్డి అరెస్ట్ టైంలో 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగింది ఎవరని ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని నిలదీశారు.

నిజంగా నాకు రాజకీయ కాంక్ష ఉంటే పాదయాత్ర చేసినప్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకునే ఉంటే అడిగేది ఎవరని మండిపడ్డారు. పొందాలనుకున్న పదవి మొండిగానైనా పొందగలనని షర్మిల స్పష్టం చేశారు. వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చూడాలనుకున్నారు. మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. మీతో ఉన్నంత కాలం సీఎంగా అయ్యే వరకు నాకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం  చేశారు. షర్మిలపై జగన్ విమర్శలు పెంచే కొద్దీ షర్మిల ఎమోషనల్ రాజకీయాల డోస్ పెంచుకుంటూ పోతున్నారు.

TAGS