Jagan VS Sharmila : చేసిందంతా చేసి ఎన్నికల ముంగిట చెల్లిని మిస్ అవుతున్నానంటే ఎలా?
Jagan VS Sharmila : అన్నాచెల్లెల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అది వారి అనురాగం, ఆప్యాయతలో తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్, షర్మిల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత కాదనుకున్నా బంధుత్వాలు ఎక్కడకు పోతాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినంత మాత్రాన అనుబంధం పోతుందా? ఆప్యాయత తరుగుతుందా? వారి బంధం తెగుతుందా? లేదనే అంటున్నారు వారు.
చెప్పుడు మాటలకు చాలా కుటుంబాలు కూలిపోయాయి. ఇప్పుడు షర్మిల చేస్తుంది అదే అని జగన్ చెబుతున్నాడు. కానీ తన అన్న తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె అంటోంది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అన్న మీదే కారాలు మిరియాలు నూరుతోందని జగన్ బాధపడుతున్నాడు.
చెల్లె షర్మిలను మిస్ అవుతున్నారా? అనే ప్రశ్నకు జగన్ స్పందిస్తూ కచ్చితంగా మిస్ అవుతున్నాను. ఆమె బయటకు వెళ్లినా ప్రేమలు పోవు కదా అంటున్నారు. చంద్రబాబుతో కలిసి మా కుటుంబానికి అన్యాయం చేసే కాంగ్రెస్ లో చేరింది. శత్రువులతో చేయి కలపడం జీర్ణించుకోలేకపోతున్నాను అని సమాధానం ఇచ్చారు. మాకు ద్రోహం చేసే వారితో కలవడం బాధ కలిగిస్తుందన్నారు.
అధికారం కోసమే అయితే ఇంకా వేరే పార్టీలున్నాయి కదా. కాంగ్రెస్ లో చేరడం బాధాకరం. మా కుటుంబ రహస్యాలు వారికి చెప్పి బదనాం చేయాలని చూస్తోంది. అందుకే షర్మిల త్వరలో తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మంచి మనసు ప్రసాదించి త్వరలో మా కుటుంబంలోకి తిరిగి వచ్చేలా ఆ దేవుడే చేస్తాడని చెబుతున్నారు.
షర్మిల చేసిన పనికి కోపం రావడం లేదు. తాను ఓ చిన్న పిల్లలాగే చూస్తున్నారు. ఎంత ఎదిగినా చిన్న పిల్ల మనస్తత్వం ఇంకా పోలేదని తెలుస్తోందంటున్నారు. అందుకే ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తోంది. ఎన్ని చేసినా త్వరలో తిరిగి మా ఇంటికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా చెల్లి షర్మిలను ఎంతో కష్టపడితేనే కదా ఆమె బయటకు వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. ఆమెకు రావాల్సిన ఆస్తిని ఇవ్వలేదు..2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెల్లి రాజకీయంగా తనకు ఎక్కడ అడ్డు వస్తుందో అనే భయంతో ఆమెను పూర్తిగా పక్కక పెట్టారు. జగన్ తప్పు చేసి ఆ నెపాన్ని చెల్లి మీదకు నెట్టడం ఎందుకని అంటున్నారు. చేసిదంతా చేసి ఎన్నికల ముంగిట సెంటిమెంట్ కురిపిస్తే ఎలా అని విమర్శిస్తున్నారు.