Nara Lokesh : జగన్.. రూ.12.85 కోట్లు స్వాహా చేశారు : నారా లోకేశ్

Nara Lokesh
Nara Lokesh : గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె రక్షణ కోసం రూ.12.85 కోట్లు ఖర్చు చేసిన ఉత్తర్వులను మంత్రి నారా లోకేశ్ బయటపెట్టారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం జగన్ రూ.12.85 కోట్లు స్వాహా చేశారంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఇనుప కంచెను నిర్మించాడని ఖర్చు చేశారని ఆరోపించారు. పేదల ఇళ్ళ కోసం ఖర్చు చేసే భారీ మొత్తాన్ని జగన్ అత్యవసర భద్రతా కారణాల సాకు చూపుతూ ఖర్చు చేశారని దుయ్యబట్టారు. జగన్ తన ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని లోకేశ్ అన్నారు.