Minister Lokesh : జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకో : మంత్రి లోకేశ్

Minister Lokesh
Minister Lokesh : జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్. అలాంటి వ్యక్తి వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారు. జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి. కూటమి ప్రభుత్వం లెక్కలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎక్స్ లో పోస్టు పెట్టాం. చదువు వస్తే చదువుకో.. కళ్లుంటే చూడు. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కొని ఎగ్ పఫ్ల పేరుతో జగన్ ప్రజాధనం రూ.కోట్లు మెక్కారు. ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు’’ అని ట్వీట్ చేశారు.