Nagababu : జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి: జనసేన నేత నాగబాబు

Nagababu
Nagababu : ఏపీ వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఘటనపై మాజీ సీఎం జగన్ చేస్తున్న శవ రాజకీయాలు మానుకోవాలని జనసేన నేత నాగబాబు అన్నారు. వినుకొండలో రషీద్ హత్యపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా కాలేదు, అప్పుడే విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశామని మండిపడ్డారు. ఆయన మరోసారి అధికారంలోకి రాకుండా చేసి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో హాజరుకాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని నాగబాబు ఆరోపించారు.
వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబసభ్యులను నిన్న (శుక్రవారం) మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి వినుకొండలో రషీద్ హత్యే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు.