Jagan – Sharmila : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్సార్ 75వ జయంతి సందర్భండి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి అంజలి ఘటించారు. సమాధిపై జగన్ పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తల్లి విజయమ్మ ఈ సందర్భంగా జగన్ ను ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన వెంట వైసీపీ ఎంపీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరోవైపు కుటుంబంతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వచ్చారు. తల్లి విజయమ్మ భర్త అనిల్, కొడుకు రాజారెడ్డి, కోడలు, కూతురితో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ప్రార్థనలు చేశారు.