Jagan Service Batch : కానిస్టేబుళ్లకు సైతం సమానం కాని జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు
Jagan Service Batch : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా జగన్ సేవలో మునిగి ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేయడమే ఉద్యోగంగా మార్చకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పారిపోయేందుకు కూడా అవకాశం లేకుండా చంద్రబాబు టైట్ చేస్తున్నారు. మన్నించాలని, లేదంటే వేడుకుంటామని చంద్రబాబును కలుస్తామంటూ సదరు అధికారులు తాడేపల్లికి వస్తున్నారు. వీరిని పోలీస్ కానిస్టేబుళ్లు గుర్తించి పంపించేస్తున్నారు.
సీఐడీ చీఫ్ సంజయ్ సెలవు తీసుకొని అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ టూర్ ను రద్దు చేయించారు. దీంతో ఆయన ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బాబు ఇంటి వద్ద ఆయనకు అనుమతి లేకుండా పోలీసులు నిలిపివేశారు. తాను ఎలాగైనా బాబును కలవాలని కదిలేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆయన కారును బలవంతంగా పక్కకు తీయించారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుకు ఇదే అనుభవం ఎదురైంది.
బాబు అరెస్టులో కీ రోల్ పోషించిన ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డిదీ ఇదే పరిస్థితి. ఆయనను కలిసేందుకు బాబు అంగీకరించలేదు. ఈయనతో పాటు గుంటూరు కలెక్టర్ వేణగోపాల్ రెడ్డిని కూడా కలిసేందుకు అంగీకరించలేదు. వైసీపీ సర్వీస్ లో మునిగిపోయిన అధికారుల మొహాలు చూసేందుకు ఇష్టపడడం లేదు. సీఎస్ సెలవు పెట్టి వెళ్లిపోవాలని చంద్రబాబు సూచించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బాబు అధికారుల విషయంలో ఇంత కఠినంగా ఉండడం ఎప్పుడూ లేదు. కానీ ఈ సారి అధికారులకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే, లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఇలాంటి లిస్ట్ తయారు చేశారు. దాని ప్రకారం.. వైల్డ్ డిషిజన్స్ తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది.