Jagan Criticized Chandrababu Vision : ఏపీ సీఎం జగన్ ప్రవర్తించే తీరు ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. స్వతహాగానే ఆయన ఎవరి మాట వినరు. ఎవరితో ఎక్కువగా మాట్లాడరు అనే పేరుంది. ఈ క్రమంలో ఆయన సీఎంగా ఎన్నికయ్యాక ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు అని చెబుతుంటారు. అయితే ఆయన తాజాగా మాచర్లలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించే ఆ మాటలు.
అయితే జగన్ ఏది మాట్లాడినా ముందుంగా వచ్చే పేరు చంద్రబాబుదే. ఆయన సాక్షి పేపర్ కూడా అంతే. చంద్రబాబుపై వ్యతిరేక కథనాలు లేని రోజంటూ ఒకటి కూడా ఉండదు. ఆయన కోసం సపరేట్ పేజీలనే పెట్టిన రోజులు అనేకం. ఇక బాస్ జగన్ ఎందుకు తగ్గుతారు. తమ సభల్లోనూ చంద్రబాబు జపమే చేస్తుంటారు. ఇక తాజాగా ఆయన చంద్రబాబు విజన్ ను అవహేళన చేశారు. చంద్రబాబు మాట్లాడితే యాభై ఏళ్ల వరకు చేయాల్సిన పనులు చెబుతుంటారని, అప్పటివరకు ఎవరు బతికుంటారని ఎద్దేవా చేశారు. అయితే ఒక లీడర్ కు ఉండాల్సిన ముందుచూపుపై కూడా జగన్ విమర్శలు చేశారు.
ఇఖ స్క్రిప్టు ప్రకారమే జగన్ నడుచుకుంటారనే పేరు ఆయనకు ఉంది. చంద్రబాబు వ్యవహారశైలిని విమర్శించడానికి ఆయన కొత్త వాదన తెరపైకి తెస్తుంటారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు శంకుస్థాపనలు అంటూ ఇప్పుడు తాను హడావిడి చేస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఐదేళ్ల పాటు ఏదో ఒక అభివృద్ధి పనిని నెత్తినెత్తుకున్నారు. సంపద సృష్టి ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని అహర్నిశలు శ్రమించారు. మరి ప్రధాని మోదీ కూడా విజన్ 2047 తో ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు చేయగలరా అంటే లేదు. ఎందుకంటే కేసుల కత్తి కేంద్రం వద్దే ఉంది.
ఇక ఇటీవల ఓ బినామీ కంపెనీకి 99 ఏండ్ల లీజులతో భూములను కట్టబెట్టారు. మరి 99 ఏళ్ల వరకు ఎవరు బతికుంటారని జగన్ ఇలా చేశారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రాష్ర్టంలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబును పదే పదే విమర్శించడం ద్వారా తానేదో గొప్ప లీడర్ అని జగన్ అనుకుంటున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతల సలహాలు తీసుకున్నారని, ఇలాంటి గుణం కూడా జగన్ కు లేకపోయిందని మండిపడుతున్నారు. ముందుచూపు ఉన్న పాలన చంద్రబాబు ది అయితే ముంచెపాలన జగన్ ది అని విమర్శలు చేస్తున్నారు.