JAISW News Telugu

Jagan Reddy : వారినీ వదల్లేదు జగన్ రెడ్డి..బహుమతుల పేరిట ఎర..సుప్రీంకోర్టులో ఫిర్యాదు?

Jagan Reddy baited in the name of gifts

Jagan Reddy baited in the name of gifts

Jagan Reddy : ఏపీ సీఎం జగన్ రెడ్డి నిర్వాకాలు ఏ ఒక్కదానికో పరిమితం కాదు..‘‘ఎందెందు వెతికినా అందందే కలవు’’ అన్నట్టుగా సర్వ వ్యవస్థల్లోనూ ఉన్నాయి. వీటి గురించి అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న కీలక వ్యక్తులకు ఆయన లంచాల ఎర చూపినట్టుగా తాజాగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడేండ్ల కింద ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న ఓ న్యాయమూర్తికి రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ న్యాయమూర్తి తిరస్కరించడమే కాదు సుప్రీంకోర్టుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర నిఘా సంస్థల సాయంతో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం తాజాగా బయటకు రావడంతో సంచలనం రేపుతోంది. టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఖరీదైన బహుమతులను తీసుకుని వీరు న్యాయమూర్తుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు పిలవకపోయినా వెళ్తున్నారని అంటున్నారు. ఆ బహుమతులు కోట్ల విలువైనవి కావడంతో ఆశ్చర్యపోక తప్పడం లేదు.

ఈ బహుమతుల విషయంలో ఇంకా చాలా విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ రెడ్డి అధికారంలో లేనప్పుడే న్యాయవ్యవస్థపై నిందలు వేసేవారు. తనకు వ్యతిరేకంగా వచ్చే తీర్పులను మేనేజ్ చేస్తే ఇచ్చారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక మరింత బరి తెగించారు. రాజ్యాంగ విరుద్ధంగా తాను తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టి వేస్తే ఉద్దేశాలను ఆపాదించేవారు. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే సమయంలో ఎన్వీ రమణపైనా తప్పుడు ఆరోపణలతో లేఖలు రాశారు. బయటపడనివి కొన్నే.. బయటపడాల్సిన లీలలు ఇంకా ఎన్నో ఉన్నాయన్న గుసగుసలు న్యాయవర్గాల్లో వినపడడం గమనార్హం.

అక్రమంగా సంపాదించడం.. దాన్ని తలా కొంచెం పంచి.. తన దారికి అడ్డంగా లేకుండా చూసుకోవడం జగన్ రెడ్డి నైజం అని.. దాన్ని అన్ని వ్యవస్థలకూ అంటించేసి ఘోరమైన తప్పు చేశారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయనకు తాత్కాలిక లబ్ధి కలుగవచ్చు..కానీ భవిష్యత్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అనుభవంలోనే తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version