Rushikonda Jagan Palace : తాను పేదల సీఎంనని చెప్పకున్న జగన్ నిజస్వరూపం బయట పడడంతో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, బిలియనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. దేశంలో అత్యంత కోటీశ్వరులైన అంబానీ, అదానీ భవంతులు కూడా ఈ స్థాయిలో నిర్మించుకోలేదు కాబోలు. వారు సైతం ఈ నిర్మాణాలు చూసి ఆశ్చర్యపోతున్నారు కావచ్చు. అదీ జగన్ రాజసం.
“విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మార్బుల్స్, టైల్స్‌తో నిర్మించిన గదులు, దాదాపు ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన వాకింగ్ ట్రాక్ లు, ఖరీదైన షాండ్లియర్లు, నాలుగు వందల మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్, భవనాల బయట ఎటుచూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచి ఎటు చూసినా సముద్రం కనిపించేలా నిర్మాణం’’ ఇదేదో భారీ ఎత్తున నిర్మించిన సినిమా గురించి కాదు.. మాజీ ముఖ్యమంత్రి తన హయాంలో నిర్మించుకున్న భవంతుల గురించి..
అడ్డగోలు రేట్లతో జనాన్ని పీల్చి పిప్పి చేసి దోచుకున్న జగన్ .. అలా ప్రజల నడ్డి విరిచి కట్టుకున్న సొమ్ముతో రాజభోగం అనుభవించాడు. పైకి మాత్రం తాను సుద్దపూసనని చెప్పుకున్నదంతా వట్టిదేనని తేలిపోయింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అతి నిక్షేపంగా ఉన్న టూరిజం రిసార్టులను కూల్చేసి, పర్యావరణ నిబంధనలన్నింటినీ తొక్కేసి కట్టిన ప్యాలెస్ వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు చిన్న ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ గంటా శ్రీనివాసరావు ప్యాలెస్‌లోకి ఎంటరవడంతో అసలు సినిమా కనిపించింది.
ఒక్కో కమోడ్ రూ. 25 లక్షలకు పైమాటే. బాత్ టబ్ రేటు గురించి ఎంత తక్కువ చెప్పకుంటే మరీ అంత మంచిది. ఒక వస్తువుకు మించి మరో వస్తువుకు రేటు డబుల్ గానే ఉంది. బాత్ రూమ్ ఫిట్టింగ్అయితే ఏదీ లక్ష రూపాయలకు తక్కువ లేదు. ఇక మాస్టర్ బెడ్ రూంలో కట్టిన బాత్ రూం పేదలకు నిర్మించిన సెంట్ ఇంటి స్థలం కన్నా .. రెండింతలు ఉన్నది. రెండు సెంట్లలో బాత్ రూం కట్టుకున్నాడంటే జగన్ లగ్జరీ లైఫ్ ఎలా అనుభవించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జగన్ రాజభవనంలో ఉన్న లగ్జరీయిస్ వస్తువులకు వెచ్చించిన డబ్బులతో పేదలకు రెండు స్థలాల్లో ఇళ్లు కట్టేయవచ్చు. జగన్ రెడ్డి వైఖరి చూస్తుంటే శాశ్వత అధికారం తనదేనని ఊహించుకొని ఈ స్థాయిలో ఇల్లు కట్టుకున్నాడేమోనని అనిపిస్తుంది. అందుకే ఇక తానోక రాజులా భావించి ఇంద్రభవనాన్ని తలపించేలా భవంతులు నిర్మించుకున్నాడని అనిపిస్తుంది. ఇక రుషికొండ నుంచి పరిపాలనే తరువాయి అన్నట్లుగా ఫిక్సయిపోయినట్లున్నాడు. కానీ ఏం చేస్తాడు చేసిన పాపాలకు ప్రకృతి కన్నెర్ర చేసింది. అధికారం అందనంత దూరమైంది.
ఈ రుషికొండ ప్యాలెస్ వీడియోలు, ఫోటోలు చూసి జనం ఆశ్చర్యపోక తప్పడం లేదు. ప్రజాధనాన్ని ఇంత ఘోరంగా ఖర్చు పెట్టే సీఎం ఎవరైనా ఉంటారా, తన లగ్జరీల కోసం ఇలా చేస్తారా అనే చర్చలు ఏపీతో పాటు దేశమంతా సాగుతున్నాయి. జగన్ వైఖరి చూస్తుంటే రాజుల కాలాన్ని వెనక్కి తెద్దామనుకున్నాడో ఏమోనని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలు కవర్ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. విశాఖకు ఎవరైనా ప్రముఖులు వస్తే బస చేసేందుకు కట్టిందని చెప్పడం ఏ ఒక్కరూ నమ్మడం లేదు. కానీ నిజానిజాలేంటో ప్రజలకు తెలుసు. తాను చిన్న ఇల్లు కట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారని జగన్ కూడా గతంలో అన్నారు. ఎవరినో పిచ్చి వాళ్లను చేయాలనుకున్నారు. కానీ జగన్ రెడ్డి మరోసారి ప్రజలకు అడ్డంగా బుక్కయిపోయారు.