YS Jagan – Rahul Gandhi : వైసీపీ అధినేత జగన్ బెంగళూరు పర్యటన వెనుక కథలు కథలుగా చెబుతున్నారు. మొన్న బెంగుళూరు వెళ్ళడానికి జగన్ ఎందుకు అంత తొందరపడ్డాడో ఇప్పుడు అర్థమైంది. రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు బెంగళూరు వేదిక జగన్ మంతనాలు జరిపారన్న నిజం వెలుగుచూసింది.
సోమవారం సాయంత్రం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల విలీనం, పలు అంశాలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయాలంటూ జగన్ గొంతెమ్మ డిమాండ్లు చేయగా, రాహుల్ గాంధీ నో చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో ఇలాంటి డిమాండ్లు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఇప్పుడు రాజకీయంగా ఒంటరిగా ఉన్నారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. మీ పార్టీని బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మీ వ్యవహారాలు నేను చూసుకుంటానని రాహుల్ గాంధీ జగన్ కు చెప్పారని అనుకుంటున్నారు.
రాహుల్ గాంధీ సమావేశాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ ప్రతిపాదనలకు అంగీకరించకుండా మళ్లీ కలుద్దాం అని జగన్ చెప్పారని అనుకుంటున్నాను. ఈలోగా, ఆలోచించుకోవాలని రాహుల్ కూడా అన్నారని.. ఇద్దరి భేటి ఇలా అసంపూర్తిగా మిగిలిందని టాక్..