YS Jagan : జగన్ పైత్యం.. సొంత మీడియా బాకా

YS Jagan

YS Jagan

YS Jagan : అధికారం నాదే, సొంత మీడియా నాదే , అంతే కాదు సోషల్ మీడియా లో కూడా నేను చెప్పిందే వేదం. అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల కాలంలో ఆడింది ఆట, పాడింది పాట ల సాగింది వ్యవహారం. పాలకవర్గంలో తప్పులు జరిగినా అందుకు చంద్రబాబు మనుషుల జోక్యంతోనే జరిగిందని మీడియాలో చాటింపు జరుగుతుంది. వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించినా అక్కడ చంద్రబాబు నాయుడు మనుషులే ముందు వైసీపీ నేతలను కొట్టారు. దాంతోనే గొడవ జరిగింది అంటూ అధికార పార్టీ మీడియాలో పెద్ద, పెద్ద కథనాలు వస్తుంటాయి. మే 13 న జరిగిన ఎన్నికల సందర్బంగ ఏపీ లో అల్లర్లు జరింగింది విదితమే. 

ఎన్నికల సందర్బంగ కొందరు వైసీపీ నాయకులు, కార్య కర్తలు అల్లర్లు సృష్టించారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన నాయకుల, కార్యకర్తల, ఇల్లు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నష్టపరిచారు. ఇదంగా గమనించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటికప్పుడు కొందరు పోలీస్ అధికారులను బదిలీ చేసింది. జరిగిన సంఘటనపై సిట్ బృందం ఏర్పాటు చేసింది. సిట్ బృందం విచారణ చేసి నివేదికను రాష్ట్ర డీజీపీ కి అందజేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విఫలమైనదని సిట్ తన నివేదికలో తెలిపింది. ఇంకా మరింత లోతుగా విచారణ చేసిన నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.  

పోలింగ్ రోజు జరిగిన అల్లర్లకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రధాన కారణమని జగన్ సొంత మీడియాలో కథనాలు. మీడియా లో వచ్చిన కథనాలు చదివితే ఇది నిజమేనా అని నమ్మే విదంగా వార్తలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే శోధించి, సాధించి రాసిన మరో కథనం ఏమిటంటే. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి ఏపీ లో సుమారు 40 మంది  తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకున్నారనే వార్తలో నిజమెంతో చెప్పకనే చెప్పేసింది. 

రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు పూర్తి భాద్యత కూడా చంద్రబాబు తో పాటు పురందేశ్వరి నాయకులదేనని తేల్చేసారు. వైసీపీ ని ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే అనుకూలమైన అధికారులను తెచ్చుకొని ఎన్నికల రోజు అల్లర్లు సృష్టించారని కథనాలు రావడం మరో నిజం.  

చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకోవడంతోనే అల్లర్లకు పాల్పడ్డారని,  జరిగిన అల్లర్లకు కూడా ఆ ఇద్దరు నాయకులే భాద్యులని ఆ మీడియా సంస్థల్లో నిజా, నిజాలను ప్రజలకు వివరించి జరిగిన నష్టానికి తాము భాద్యులం కామంటూ తీర్పు వెల్లడించారు.

TAGS