జగన్ గురించి తెలిసినవారు మాత్రం ఆ అవకాశం లేదని చెప్తున్నారు. వారి ఆస్తుల పంచాయితీ టాపిక్‌ను అరగదీసి ప్రజలకు బోర్ కొట్టించేశామని భావించిన బహుశః మరో హాట్ టాపిక్‌కి షిఫ్ట్ అయి ఉండవచ్చు. ఇంత కాలం జగన్ తల్లి విజయమ్మ కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు. కానీ ఆస్తుల పంచాయితీ మొదలైన తర్వాత ఆమె ‘గాంధారిలా కళ్లుండి వాస్తవాలు చూడలేకపోతున్నారని’ తేలడంతో జగన్ జాబితాలో ఆమె పేరు తొలగించినట్లేనని భావించవచ్చు.
జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉండగా మాటకు ముందూ, వెనుకా ‘మన ప్రియతమ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ అవసరం మళ్లీ పడిన్నట్లుంది. అందుకే ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు కనిపిస్తున్నాయి. వాటితో ఆయన గొప్ప తెలియజేస్తూ, ఆయన వారసత్వాన్ని జగన్ క్లయిమ్ చేసుకుంటున్నట్లున్నారు. నిజానికి జగనే వైఎస్ఆర్ ఆస్తులకు, రాజకీయాలకు వారసుడని అందరికీ తెలిసినప్పుడు మళ్లీ పనిగట్టుకొని ఎందుకు క్లెయిమ్ చేసుకోవలసి వస్తోంది? అంటే కారణం చెల్లి షర్మిలనే.
వినాయక చవితినాడు చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలకు గురవకుండా వినాయక వ్రత కథ చదివి, అక్షింతలు తలపై జల్లుకుంటాం. అదే విధంగా ఈ రాజకీయాలు, ఆస్తుల విషయంలో తల్లి, చెల్లి వలన కలిగిన నీలాపనిందలు తొలగించుకునేందకు దివంగత వైఎస్ఆర్ దీవెనలు జగన్‌కు అవసరం పడి ఉండొచ్చు. తన క్యారక్టర్ ఎటువంటిదో అందరికీ అర్థమైంది. కనుక మళ్లీ ఆయన ఫొటో చూసి ప్రజలు తనని మళ్లీ ఆదరిస్తారనే ఆశ కావచ్చు లేదా ఆయనకి అసలు సిసలు వారసుడిని తానేనని, ఈ విషయంలో చెల్లికి ఎటువంటి హక్కులు లేవని చెప్పేందుకు కావచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ చాలా కాలం తర్వాత జగన్ తన సోషల్ మీడియాలో తండ్రికి స్థానం కల్పించడం అభినందనీయమే..