JAISW News Telugu

Jagan plan : వైసీపీ అభ్యర్థులకు షాక్.. పలువురిని మార్చే యోచనలో జగన్?

Jagan plan

Jagan plan

Jagan plan : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల అందరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.  టీడీపీ కూటమిలో ఫుల్ జోష్ నెలకొని ఉంది. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా కూటమి నేతల వ్యూహాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఇక ముందుంది ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ మాత్రమే. ఇప్పటికే నేతలకైతే గెలుపుపై కాన్ఫిడెన్స్ వచ్చినట్టే కనపడుతోంది. జనాల్లో కూడా కూటమిపై గురి కుదిరిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈనేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మళ్లీ అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఒకటిరెండు రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో మార్పులుంటాయి. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల బలాబలాలపై సర్వే చేయిస్తున్నారు. వారికి గెలిచే సత్తా ఉంటేనే రంగంలో ఉంచేందుకు సిద్ధపడుతున్నారు. విజయం సాధించే సత్తా లేని వారిని మార్చి ఇంకొకరికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ దాదాపు 80 మంది సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేయనున్నట్లు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర పూర్తి చేసుకుని ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో మార్పులకు అవకాశం లేదని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు విషయంలో మార్పు ఉంటుందంటున్నారు.

దీంతో వైసీపీలో మార్పులకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఉగాది తర్వాత అభ్యర్థుల విషయంలో అవసరమైన మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై జగన్ మల్లగుళ్లాలు పడుతున్నారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే అధికారం ఉండాల్సిందే. లేకపోతే పార్టీ మనుగడ కష్టాల్లో పడుతుంది. అందుకే కచ్చితంగా గెలవాలని జగన్ కంకణం కట్టుకున్నారు.

వైసీపీలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి జగన్ ను అధికారానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ గెలుపు అంత సులభం కాదనే వాదనలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చోటుచేసుకుంటాయో అంతు చిక్కడం లేదు.

Exit mobile version