Kodali Nani : రేవంత్ నడుము విరిగినా జగన్ కలిసేవారు.. నాని అనుచిత వ్యాఖ్యలు

Kodali Nani and cm revanth

Kodali Nani comments on CM Revanth reddy

Kodali Nani : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కలువాలి అనుకున్నారట. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని ఆగిపోయారట. అయితే దీనిపై నానిని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. పొరుగు రాష్ట్రాల గురించి మాకెందుకు.. మా సొంత రాష్ట్రం పనులతో తాము బిజీగా ఉన్నామని చెప్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లను నాని కొట్టి పారేస్తున్నారు.

రేవంత్ తో మాట్లాడాల్సివస్తే ఢిల్లీలో సోనియా గాంధీని సంప్రదించవచ్చని చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని కేశినేని నాని స్పష్టం చేశారు.

తుంటి గాయం కావడంతో కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే జగన్ కేసీఆర్ ను కలిసి పరామర్శించారని అన్న నాని.. రేవంత్ రెడ్డికి కూడా నడుము విరిగితేనే జగన్ వచ్చి కలిసి పరామర్శిస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సీఎం సీటును రేవంత్ రెడ్డి ఆస్వాదించాలని కోరారు.

సీఎం అయ్యాక రేవంత్ కు జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారని, వ్యక్తిగత కాల్స్ అవసరం లేదని నాని వివరించారు. జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కావడం, నాని వ్యాఖ్యలు వేడిని పెంచడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాల నాయకులు స్నేహపూర్వకంగా ఉండటం సర్వసాధారణం.

నాని వ్యాఖ్యలపై తెలంగాణలో సీఎం రేవంత్ అభిమానులను, కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. పొరుగు రాష్ట్రం గురించి మాకెందుకు అన్నమాట సబబుగానే ఉన్నా.. తుంటి విరగడం లాంటి మాటలు ఎందుకని మండిపడుతున్నారు. రేవంత్ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి జగన్ రెడ్డి కూడా సీఎం హోదాలో ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణకు వచ్చిన జగన్ కలిస్తే బాగుండని అభిప్రాయం వ్యక్తం అయ్యిందన్నారు. రాష్ట్రాధినేతల గురించి మాట్లాడాల్సి వస్తే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

TAGS