Ayyanna Patrudu : జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు – అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు వైరల్

Ayyanna Patrudu
Ayyanna Patrudu : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినందున తెలంగాణకు చెందిన కొందరు అయ్యన్నపాత్రుడి స్నేహితులు, టీడీపీ నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడే గానీ చావలేదని అన్నారు.
జగన్ ఓడిపోయాడు కానీ చావలేదంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. జగన్ కు అపారమైన ధనబలం, కులబలం ఉందని, తెలంగాణ ప్రభుత్వంలో కూడా జగన్ మనుషులు ఉంటారని పక్కన ఉన్న వ్యక్తి అన్నారు. ఈ దేశంలో డబ్బుకు లొంగనివాడు లేడంటూ ఆ వ్యక్తి అన్నారు. జగన్ ను ఈసారి లేవకుండా కొట్టాలని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కాగా, అయ్యన్నపాత్రడి వ్యాఖ్యల పట్ల వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.