MLA Vishnu Kumar : జగన్ నా ఫ్రెండ్ లేదు.. బొ.. లేదు అని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ మాట్లాడుతూ జగన్ ను నా ఫ్రెండ్ కాదనే చెప్పే క్రమంలో జగన్ నా ఫ్రెండ్ లేదు.. బొచ్చు లేదని పేర్కొన్నారు. ఆ వెంటనే ఆ పదాన్ని ఉపయోగించినందుకు క్షమించాలని కోరారు. మాటల ప్రవాహంలో జనరల్ గా ఉపయోగించే పదం వచ్చిందని, క్షమించాలని స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ స్పందించి ఆ పదం రికార్డుల నుంచి తొలగిస్తానని తెలిపారు.
జగన్ అవినీతి అక్రమాల గురించ మాట్లాడిన విష్ణుకుమార్ అవినీతి అక్రమా పై వైసీపీ అధినేత జగన్ పేరు ఇప్పుడు విదేశాలకు ఎక్కిందని అన్నారు. అవినీతి మూలాలన్నీ గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని, రుషికొండ, గంగవరం పోర్టుల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరియాని ఆరోపించారు. జగన్ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.