YS Jagan : ఏపీనే కాదు తనను కూడా నాశనం చేసుకుంటున్న జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిస్థితి అధ్వానంగా మారింది. అధికారం కోసం పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలన్ని గాలికొదిలేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఇచ్చిన హామీ గోదావరిలో కొట్టుకుపోయింది. ఇంకా దుకాణాల సంఖ్య పెంచి విచ్చలవిడిగా మద్యం తాగేలా చేస్తున్నారు. సంసారాలు గుల్ల కావడానికి పరోక్షంగా కారణంగా నిలుస్తున్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారు. ఇలా పరిపాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మీటలు నొక్కుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు అప్పులుగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి అప్పులే దర్శనమిస్తాయి. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది.
కుటుంబానికి అయినా మంచి చేశాడా అంటే అదీ లేదు. తల్లి, చెల్లిని పట్టించుకోలేదు. ఫలితంగా వారు కుటుంబానికి దూరమయ్యారు. ఇప్పుడు వారే జగన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. జగన్ ను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఆయనే నాశనం అయ్యారని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.
అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తికెక్కాయి. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. దీంతో జగన్ పై విమర్శలు పెరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బతికి బట్ట కట్టడం గగనమే అంటున్నారు. ఎక్కడికక్కడ జగన్ ను అధికారానికి దూరం చేయాలనే వాదనలు వస్తున్నాయి. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక నానా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ ను పక్కన పెట్టడం ఖాయమే అంటున్నారు.