Jagan Trolls : సోషల్ మీడియా ట్రోల్స్ కు బలవుతున్న జగన్..!

Jagan Trolls

Jagan Trolls

Jagan Trolls : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్ ఆహారంగా మారారు. ఆయన సీఎం సీటు ఎక్కినప్పటి నుంచి ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇక నాయకులను కూడా ఇబ్బంది పెడితే రాష్ట్రాన్ని తన హస్తంలో ఉంచుకోవచ్చని అనుకున్నారు. అందుకే చంద్రబాబును జైలుకు పంపారు. ఆయన బయటకు రావద్దని అనుకున్నారు. కానీ ఆయన ఊహించని విధంగా బటయకు వచ్చారు.

పవన్ కళ్యాణ్ పొత్తు టాపిక్ తీసుకచ్చినప్పుడు కూడా వీరు కలువద్దు అనుకున్నారు. కానీ రెండు పార్టీలు కలువడమే కాదు.. వెంట బీజేపీని కూడా తెచ్చుకున్నారు. దీంతో ఒక్క వ్యతిరేక ఓటు కూడా చీలకుండా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 164 సీట్లతో కూటమి అధికారంలోకి రాగలిగింది.

వలంటీర్ వ్యవస్థను సృష్టించి తన పార్టీ ప్రచారానికి వాడుకొని ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంచాలని అనుకున్నాడు. ప్రతిపక్షం అపోజ్ చేస్తే మరి సంక్షేమ పథకాలు ఇంటింటికీ ఎలా వెళ్తాయి ఎదురు ప్రశ్నించాడు. అదే నేడు సీఎం, డిప్యూటీ సీఎంలే లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి మరీ పథకాల డబ్బులను పంపిణీ చేశారు. ‘ఇప్పుడు ఎలా సాధ్యమైందంటూ’ సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.

‘ఏ బాబుకు వయస్సయ్యింది. ఆయన వణుకుతూ పాలన ఏం చేస్తాడు. రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని’ అన్నాడు. కానీ ఆయన ఇప్పుడు పాలనను పరుగులు పెట్టించడం కాదు.. యంగ్ అధికారులు, నాయకుల కంటే వేగంగా పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు బాబు వేగం ఎలా ఉందంటే ఆయనతో పోటీ పడి పని చేసేవారు లేరనిపించేలా..

ఐదేళ్లుగా జగన్ మీడియా ముందుకు వచ్చింది లేదు. కేవలం ఒకటి, రెండు సార్లు ఏదో మరీ ఎమర్జెన్సీ ఉందని ఆయన అనుకుంటే తప్ప. అది కూడా కొంత సమయమే. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం ప్రతీ విషయాన్ని ప్రజలకు వివరించాలని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ శాఖల పనితీరుపై రివ్యూలు పెట్టింది లేదు. అందుకే ఆయన మంత్రులు అంతలా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. మీడియాను సైతం భజన చేసేందుకే ఉపయోగించుకున్నాడు.

మంది మార్బలం, పరదాల మధ్య ప్రజా వేదికలను నిర్వహించడం జగన్ కే చెల్లింది. అందుకే ఆయన ‘పరదాల ముఖ్యమంత్రి’గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ఉండకూడదో జగన్ ఐదేళ్ల పాలన చూస్తే అర్థం చేసుకోవచ్చు’. అని సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రావెల్ చేస్తున్నాయి.

‘పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని నినాదాలు చేసిన ఆ ప్యాలస్ ల పేదోడు ఎటుపోయాడో. వలంటీర్లు లేకపోతే పాలన ఆగిపోతుందన్న ఆ మహానేత నేడు ఎక్కడున్నాడో. ఆయన పరదాల పాలన చంద్రబాబు ప్రజా పాలన మధ్య వ్యత్యాసం చూడలేక పారిపోయాడా?’ అంటూ జగన్ ను గట్టిగా నమిలేస్తున్నారు టీడీపీ, జనసేన అభిమానులు. పాలన అంటే జన రంజకంగా ఉండాలే గానీ, జన కంటకంగా మారకూడదని హితవు పలుకుతున్నారు. ఇక నైనా ప్రతిపక్ష హోదానైనా బాగా నిర్వర్తిస్తే పోయిన పరువులో కొంతైనా మిగలవచ్చని చెప్పుకుంటున్నారు. 

TAGS