JAISW News Telugu

Jagan-Sharmila : షర్మిలను కించపరిచి జాతీయ మీడియాలో నవ్వుల పాలైన జగన్  

Jagan-Sharmila

Jagan-Sharmila

Jagan-Sharmila :  ఏపీలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. ఓ వైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. ఎలాగైనా తన అన్నను ఓడించి తన పార్టీని గెలిపించుకోవాలని వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు ఓటర్లను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు రావడంతో ఈ సారి ఎన్నికల పై జనాలు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ.. తన సొంత చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అసలు షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదు. ఫ్యామిలీ రాజకీయ నాయకత్వం తనదేనని జగన్ తేల్చేశారు. తాను కుటుంబ రాజకీయానికి నేతృత్వం వహిస్తున్నప్పుడు.. తమ కుటుంబం నుంచి షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదన్నది జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం. వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి ఏమాత్రం మోహమాటం లేకుండా వెల్లడించారు. అంతేనా ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి రాకూడదని అలా వస్తే కుటుంబం విడిపోతుందని ఆయన అభిప్రాయం.

అసలు  జగన్ కు షర్మిల ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో బాగా తెలుసు. ఆయనతో పాటు జాతీయ మీడియా ప్రతినిధులకూ బాగా తెలుసు. అయినా షర్మిల వ్యక్తిత్వంపై ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేశారు జగన్.  షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా తనను టార్గెట్ చేయడంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాత్ర ప్రాధానంగా ఉందని సీఎం జగన్ బురద చల్లే ప్రయత్నం చేశారు. వైఎస్ వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా ఉన్న బిజినెస్ లు చూసుకుంటే బాగుండేదన్నారు. తాను కూడా చేతనైనంత వరకు సహకరించేవాడినంటూ చెప్పుకొచ్చారు. తాను షర్మిలకు ఏమీ చెప్పలేదని.. ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలనన్నారు.  ప్రతీ విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరని జగన్ ను మీడియా ప్రశ్నించింది.   “తాను నా చెల్లెలు.. నాకు తెలుసు కదా..” అని నిర్దాక్షిణ్యంగా నిందమోపేశారు. జగన్ ఇంత ఘోరంగా మాట్లాడబట్టే ఆయనకు పిచ్చి పట్టిందన్నట్లుగా అన్న పై  షర్మిల విమర్శలు చేశారు . జగన్ ఇంగ్లిష్ ఇంటర్యూలు తెలుగులో వైరల్ కాలేదు కానీ.. జాతీయ మీడియాలో వాటిని చూసిన వారు మాత్రం ఇంత మానసిక స్థితి బాలేని వ్యక్తి  ప్రస్తుతం రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version