Chandrababu : జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని..

Chandrababu

Chandrababu

Chandrababu : మూడు రాజధా నులంటూ సీఎం జగన్ మూడు ముక్కలాటకు తెరలేపి.. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి.. చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని  రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.. తెలుగు ప్రజల ఆత్మగౌర వమని.. రాష్ట్రానికి ఎంత అవమానకరం.. ఎంత బాధాకరం.. ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అంటూ మండిపడ్డారు.

 రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చు నే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు.సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ (Brand of Andhra Pradesh)ని జగన్ నాశనం చేశారని.. ప్రజలారా.. అసమర్థ, అహం కార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నా మో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

కాగా రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జగన్‌ సర్కారు దా‘రుణ’ దాహానికి నిదర్శనం. సచివాలయంలో ఐదు బ్లాకులు (భవంతులు) ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి.

ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. ‘కుదరదు’ అని ఐసీఐసీఐ తేల్చ డంతో, హెచ్‌డీఎఫ్‌సీకు వెళ్లారు. ‘ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు. సచివాలయ భవనాలను తాక ట్టు రిజిస్ట్రేషన్‌ చేసిస్తే.. మొత్తం నిర్మాణ వ్యయం లో సగం అప్పుగా ఇస్తాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో.. గుట్టుచప్పుడు కాకుండా సచివాలయ భవనాలను హెచ్‌డీఎఫ్‌సీకి తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చేశారు.

TAGS