Jagan-Chandrababu Posters : జగన్, చంద్రబాబు పోస్టర్లు – సోషల్ మీడియాలో వైరల్

Jagan-Chandrababu Viral Posters
Jagan-Chandrababu Viral Posters : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ‘ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రజలకు ఇవ్వరు. జిరాక్స్ లు మాత్రమే ఇస్తారు’ అని మొదలై ‘ఆలోచించు ఆంధ్రుడా.. మళ్లీ మళ్లీ మోసపోవద్దు!’ అని ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘అమెరికాలో ఒరాకిల్ సంస్థ ప్రకారం ప్రపంచంలో పనిచేసే మొదటి ఏడుగురు అద్భుత వ్యక్తుల్లో ‘‘బాబు’’ ఒకరు!’ అని మరొక పోస్టరు కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రమాదంలో ఆస్తులు’ పోస్టరులో జగన్ మళ్లీ గెలిస్తే స్థలాలు అన్నీ నావే అని జగన్ అంటాడని పేర్కొనడంతో ప్రజలు ఈ యాక్ట్ పై ఆలోచనలో పడ్డారు. ఈ పోస్టర్ ను చాలా మంది షేర్ చేసుకుంటూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు పోస్టరును కూడా సోషల్ మీడియాలో ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.