Raghurama Krishnam Raju : ‘జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేడు’.. రఘురామకృష్ణ రాజు కామెంట్స్ – సోషల్ మీడియాలో వైరల్

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju : ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టలేడు అని రాఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 150 అసెంబ్లీ సీట్లు సాధించి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటిస్తుండగా తాజాగా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైసీపీ 151కి పైగా స్థానాల్లో గెలుపొందుతుందని, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలా అనే ఆలోచనతో పలు ప్రదేశాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నారు. అయితే, ఇదంతా నిజమేనని, వైసీపీ వారు ప్రమాణ స్వీకారం కోసం ఓ ప్రదేశాన్ని డిసైడ్ చేశారని అది వైజాగ్ లోని పిచ్చాసుపత్రి అని రఘురామ ఎద్దేవా చేశారు. కాస్త వెరైటీగా ఉండడం కోసం మెంటల్ ఆస్పత్రిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపిక చేశారని కామెంట్ చేశారు.
మంచి అవకాశం వచ్చినా జగన్ వినియోగించుకోలేక పోయారని రఘురామ తెలిపారు. అసలు ఇక జగన్ అసెంబ్లీకి రాడని, ఒకవేళ అతను గెలిచినా అసెంబ్లీకి మాత్రం రానేరాడని, మీరు రాసిపెట్టకోండి అని ఖరాకండిగా రఘురామ వెల్లడించారు.