Jagan Bandage : జనాల ట్రోలింగ్ దెబ్బకు జగన్ బ్యాండేజీ మాయం!

Jagan Bandage
Jagan Bandage : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు తమదే అంటూ ప్రధాన పార్టీలు ధీమాగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన చిన్న గాయమైంది. దానికి బ్యాండేజ్ వేయించుకుని ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఆయన గాయం మానలేదా? అని ప్రజల్లో తీవ్ర చర్చ నడిచింది. దీనిపై ప్రతిపక్షనేతలు విమర్శించమే కాదు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. కోడికత్తి డ్రామా -2 అంటూ ఎద్దేవా చేశారు.
ఈ విషయం వైసీపీ పెద్దల దృష్టికి చేరిందేమో కానీ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ బ్యాండేజ్ లేకుండా కనిపించడంతో ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ కట్టును తీసేశారని సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయమై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తాజాగా స్పందించారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం.. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఎద్దేవా చేశారు. అయితే లోకేశ్ చేసిన ట్వీట్ పై వైసీపీ కూడా స్పందించింది. ‘త్వరగా కోలుకో నారా లోకేశ్. మీరు మా మ్యానిఫెస్టో లాంచ్ పై కూడా ఓ కన్నేసి ఉంచడం ఆనందంగా ఉంది’ అని పోస్ట్ చేసింది. దీనికి సీఎం జగన్ నుదుటిపై గాయం ఇదిగో అంటూ ఓ ఫొటోను జతచేసింది.
కాగా, కోడికత్తి డ్రామాలాగానే గులకరాయి ఘటనను కూడా సింపతీ కోసం వాడుకుందామనుకున్నారు. అయితే చిన్న గాయానికే ఇంకా ఎన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటారని.. ఎన్నికల పోలింగ్ అయ్యేదాక బ్యాండేజ్ తీయరా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమయ్యాయి. వైసీపీ బలం మ్యానిఫెస్టోనో.. అభివృద్ధో కాదని..జగన్ బ్యాండేజే అంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ఎద్దేవా చేశారు. ఇక ఆయన చిన్నాన్న కూతురు, చెల్లెలు డాక్టర్ సునీతా కూడా ఎక్కువ రోజులు బ్యాండేజీ పెట్టుకుంటే సెప్టిక్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ పెద్దలు ఇదేదో బాగోలేదని అనవసరంగా ప్రజల్లో బ్లేమ్ కావడం ఎందుకని బ్యాండేజీని తీయించినట్టు తెలుస్తోంది.
ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం … జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం 🤕😂#KodiKathiKamalHassan#KodiKathiDrama2 pic.twitter.com/TDfTC7Vb4k
— Lokesh Nara (@naralokesh) April 27, 2024