JAISW News Telugu

Jagan and KCR : జగన్, కేసీఆర్ పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదా!

Jagan and KCR

Jagan and KCR

Jagan and KCR : తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని ఇద్దరికీ తెలిసిందే. అయితే ఇదంతా వారి స్వయంకృత అపరాధమని చెప్పక తప్పదు. కేసీఆర్‌ విషయానికి వస్తే రేవంత్‌ ను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపి, ఆయన కూతురు పెళ్లిలో అవమానించారు.

ఏనాటికైనా కేసీఆర్‌ను జైలుకి పంపి చిప్పకూడు తినిపిస్తానని అప్పుడే రేవంత్‌ శపథం చేశారు. ఇప్పుడు తెలంగాణ పగ్గాలు రేవంత్ చేపట్టాడు. ఆయన అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్‌ కేసు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులతో సహా మరో ఆరు కేసులు సిద్ధం చేశారు. వీటిలో ఏదో ఒకదానిలో జైలుకి పంపడం ఖాయమని తెలుస్తుంది.

ఇక, ఏపీ మాజీ సీఎం జగన్ విషయానికి వస్తే ఐదేళ్లు రాజకీయ కక్ష సాధింపులతో గడిపాడు. చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో జైలులో పెట్టించారు. ఎంపీ అని చూడకుండా రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి అరికాళ్లు వాచిపోయేలా కొట్టించారు. ఇప్పుడు రఘురామ ఫిర్యాదుతో జగన్‌పై కేసు నమోదైంది.

ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రజాస్వామ్య బద్ధంగా జగన్‌ ప్రభుత్వంతో పోరాడుతుండేవి. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చామని తల పొగరును చూపించిన జగన్ వారిని ఎదుర్కోవడం పర్సనల్ ఎజెండాగా పెట్టుకున్నాడు. టీడీపీ నేతలను వెంటాడి  వేధించాడు. బాబుతో సహా టీడీపీలో ప్రతీ ఒక్కరిని జైలుకు పంపి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అప్పుడు వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని జగన్‌ తప్పు అనుకోలేదు. వాటి పర్యవసానాల గురించి ఆలోచించలేదు. కనుక ఇప్పుడు జగన్‌ స్వయంకృతాపరాదమే అని చెప్పక తప్పదు.

టీడీపీ ప్రభుత్వంలో జగన్ పై తొలి కేసు నమోదవగానే రాజకీయ కక్ష సాధింపునకు ప్రభుత్వం పాల్పడుతోందని గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో పోలీసులు దొంగలను చిన్న దెబ్బ కొట్టినా పెద్దగా అరుస్తూ బాధ నటిస్తుంటారు. దీంతో మరిన్ని దెబ్బలు పడకుండా తప్పించుకోవచ్చని ఆశ. వైసీపి తీరు కూడా అలాగే ఉంది. పెద్దగా అరిచి గగ్గోలు పెట్టేసినంత మాత్రాన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తప్పించుకోలేరు కదా?

జగన్‌పై ఈ కేసు చాలా చిన్నదే.. ముందున్నాయి అసలు కేసులు. కనుక వాటి కోసం జగన్‌తో సహా వైసీపీ నేతలు సిద్ధంగా ఉండక తప్పదు. తప్పుడు ఆలోచనలు చేసే నేతలను నమ్ముకున్న ఎవరికైనా బాధలు తప్పవు కదా?

Exit mobile version