Jabardasth Faima : ఆసుపత్రి బెడ్ మీద ఫైమా.. ఏమయ్యిందో అనే ఆందోళనలో ఫాన్స్!
Jabardasth Faima : ఫైమా అంటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ భామ కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ఫైమాకు తన హావ భావాలతోనే ప్రేక్షకులను నవ్వించగలిగే సామర్థ్యం ఉంది.. దీంతో ఈమె అతి కొద్దీ సమయంలోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది..
ఫైమా జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యింది.. ఈ షోలో ఈమె లేడీ కమెడియన్ గా తన హవా చూపిస్తుంది.. మరి ప్రేక్షకులకు బాగా గుర్తిండి పోయే విధంగా పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా ఆసుపత్రి బెడ్ మీద కనిపించి షాక్ ఇచ్చింది.. ఫైమా బెడ్ మీద సెలైన్ పెట్టుకుని కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు ఈమెకు ఏమయ్యిందో అనే ఆందోళనలో ఉన్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈమెకు ఏమయ్యిందా అనే ఆందోళన చూపిస్తున్నారు. ఫైమా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది.. అందులో ఆమె హాస్పిటల్ బెడ్ మీద హాస్పిటల్ డ్రెస్ లో కనిపించింది.
ఈ వీడియోకు నా గతమంతా నే మరిచానే అనే పాటను కూడా జోడించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఈ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.. ఈమెకు ఏం జరిగిందో కూడా చెబితే బాగుండేది అని ఇది షూటింగ్ లో భాగం అయితే ఈమె తన ఫ్యాన్స్ ను ఇలాంటి వీడియోలతో హర్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈమెకు నిజంగా ఏదైనా అయితే మాత్రం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.