Chinese : చైనావాళ్లు సుఖం కోసం గాడిదలను వదలట్లే!

Chinese

Chinese. Donkeys’

Chinese : యవ్వనం తిరిగిరానిది. మనిషి జీవితంలో కెల్లా యవ్వనానికి ఉన్న ప్రాధాన్యం ఏ దశకు ఉండదు. ఎందుకంటే జీవితంలో స్థిరపడాలన్నా, జీవిత భాగస్వామిని ఎంచుకోవాలన్నా, గొప్ప స్థానానికి వెళ్లడానికి సిద్ధం కావాలన్నా, ‘అన్ని’ రకాల ఆనందాలను అనుభవించాలన్నా..యవ్వన దశలోనే సాధ్యం. యవ్వనంలో ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉన్నట్టే..ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఇక లైంగిక సామర్థ్యం ‘హార్స్ పవర్’ ను మించి ఉండేది కూడా ఇప్పుడే.

అందుకే ప్రతీ ఒక్కరూ నిత్య యవ్వనుడిలా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఫిట్ నెస్, మంచి డైట్ మెయింటేన్ చేస్తూ మన్మథ బాణాలు వదిలేస్తూ రతిక్రీడల కోసం ఆరాటపడుతుంటారు. ఇలా జీవితంలోని మజాను అస్వాదించాలని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తుంటారు. ఓ విదేశీ సంపన్నుడు 50ఏండ్ల పైబడి వయస్సులోనూ 20ఏండ్ల నిత్య యవ్వనుడిలా కనిపించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతడిని నిత్య యవ్వనుడిలా మార్చేందుకు ఓ ప్రత్యేక బృందాన్నే పెట్టుకున్నాడు. అంతెందుకు మన హీరోలు కూడా 60 ఏండ్ల వయసు పైబడినా ఇంకా కుర్రాళ్లలా ఉండేందుకు ఫిట్ నెస్, డైట్ మెయింటేన్ చేస్తుండడం మనకు తెలిసిందే.

అయితే అందరిదీ ఓ దారైతే చైనావాళ్లది మరో దారి అని మనకు తెలిసిందే. వాళ్లు పురుగులు, కప్పలు, పాములు, వానపాములు, గబ్బిలాలు గట్రా తింటారు. అసలు వారి ‘మెనూ’ చూస్తేనే మనకు వాంతి వస్తుంది. అలాంటి చైనావాళ్లు, వారితో పాటు మిగతా కొందరు దేశస్తులు యవ్వనం కోసం పాపం ఆ జంతువులను చంపేస్తున్నారు.

ప్రపంచంలోని దాదాపు 5 కోట్ల గాడిదల్లో మూడింట రెండో వంతు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇవే అక్కడి ప్రజలకు జీవనాధారం. అలాంటి గాడిదల దొంగతనం కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. వీటిని ఎక్కువగా చైనాకు అక్రమంగా తరలిస్తున్నారు. గాడిదలను ఏం చేసుకుంటారు అనుకుంటున్నారా? ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్.

గాడిదల చర్మంలోని జెలటీన్ తో తయారయ్యే ఔషధానికి ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని మెరుగుపరిచే లక్షణాలున్నాయని చైనా వాసుల నమ్మకం. దీంతో పాటు పలు దేశాల్లో ఏటా 59 లక్షల గాడిదలను వధిస్తున్నట్టు అంచనా ఉంది. చైనా వాళ్ల యవ్వనం కోసం ఆఫ్రికన్ల జీవనాధారం అయిన గాడిదలను చంపడం బాధాకరమే. చైనావాళ్ల  యవ్వనం కోసం గాడిదల తోలు వొలువడం.. వాటిని చంపేయడాన్ని చూసి మిగతా జనాలు అవాక్కవుతున్నారు. చైనావాళ్లు తమ సుఖం కోసం భూమ్మీది ఏ జీవరాశిని సుఖంగా ఉంచరు కాదు కదా అని ఆవేదన చెందుతున్నారు.

TAGS