JAISW News Telugu

AP Journalists : పాపం ఏపీ జర్నలిస్టులు..మైండ్ బ్లాంక్ చేసిన జగన్..

AP journalists

AP Journalists

AP Journalists : జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు. జర్నలిస్టులు, జర్నలిజం పోకడలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతో కొంత సమాజానికైతే మేలు జరుగుతుందనే చెప్పవచ్చు. ఈ కాస్త మీడియా యాక్టివ్ లేకుంటే అవినీతి, అక్రమాలు మరింత చెలరేగిపోయేవి. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైనది కావడంతో వారికి ప్రభుత్వాలు ఇండ్ల స్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు లాంటివి అందిస్తారు. అయితే గత ఐదేళ్లుగా జర్నలిస్టుల గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు ఇదిగో స్థలాలు అంటూ ప్రారంభించింది ఏపీ సర్కార్.

తాము జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశామని.. స్థలాలు ఇచ్చేస్తున్నారని ఆశ పడిన వారంతా దరఖాస్తులు చేసుకున్నారు. వేల మంది అప్లయ్ చేసుకున్నారు. ప్రక్రియపై ప్రతీ వారం ఓ అప్ డేట్ ప్రకటన రూపంలో వచ్చేది. తీరా ఎన్నికల కోడ్ వచ్చేసరికి.. జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైళ్లు చెత్తబుట్టలోకి చేరిపోయాయి.

మాజీ సమాచార, ప్రసార మంత్రి పేర్ని నాని నియోజకవర్గం  మచిలీపట్నంలో ఉన్న కలెక్టరేట్ లో ఉండాల్సిన ఫైల్స్ చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని జర్నలిస్టులు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కలెక్టరేట్ లో సమాచార శాఖ డీడీని కలిసి ఆయన వివరణ కోరారు. అయితే ఆ ఫైల్ పోయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ అధికారి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని  డీడీని హెచ్చరించారు. విచారణ చేయిస్తామని కలెక్టర్ చెప్పారు.

కానీ ఏ జిల్లాలోనూ స్థలాలు ఇచ్చే ప్రక్రియను కనీసం చివరి దశకు కూడా తీసుకురాలేదు. అస్మదీయ జర్నలిస్టులకు అయినా కేటాయిస్తారని అనుకున్నారు. నిజానికి ఇలా ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో బాకా ఊదే మీడియా సంస్థలు.. ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతో చలామణి అయ్యేవారే ఎక్కువ. ప్రభుత్వ స్థలమే కదా జగన్ రాసిచ్చేస్తారని అనుకున్నారు. చివరికి కోడ్ రాగానే చెత్తబుట్టలో పడేశారు. స్థలాల పేరుతో జగన్ చూపించని సినిమాకు వారికి మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది.

Exit mobile version