the moon : చంద్రునిపై భారీ గుహ.. కనుగొన్న ఇటలీ సైంటిస్టులు

the moon :చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించిన శాస్గ్రవేత్తలు తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ భారీ గుహ ఉందని తెలిపారు. ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ గుహ చంద్రునిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఉన్న ఒక భారీ గొయ్యి లోపల ఉంది. ఈ గొయ్యి చంద్రునిపై తెలిసిన లోతైన ప్రాంతం.

ఇది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను చంద్రుడిపైకి తీసుకువచ్చిన అంతరిక్ష నౌక అపోలో 11 ల్యాండింగ్ అయిన సైట్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటలీలోని ట్రెంటో యూనివర్సిటీకి చెందిన లోరెంజో బ్రూజోన్, లియోనార్డో క్యారెర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ గుహను కనుగొంది. వారు తమ పరిశీలనలను సైంటిఫిక్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. శాస్త్రవేత్తలు రాడార్ ను ఉపయోగించి గొయ్యి తెరవడం ద్వారా లోపలికి వెళ్లేలా చేశారు. మిలియన్ల సంవత్సరాల క్రితం చంద్రుని ఉపరితలం క్రింద ప్రవహించిన లావా కారణంగా గొయ్యి లోపల గుహ ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ గొయ్యి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.

TAGS