Hero Nithin : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జయం సినిమా ఒక సంచలనం. డైరెక్టర్ తేజ నూతన నటినటులను సెలెక్ట్ చేసి వారితోనే మూవీ తీసి ఇండస్ట్రీలో ఎప్పుడు చూడని అతి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమాకు హిరోగా నితిన్, హిరోయిన్ గా సదా, కొత్తగా పరిచయం చేశాడు. నునుగు మీసాల కుర్రాడు అయిన నితిన్, లేత వయసు అందాలతో సదా చేసిన అల్లరి 90 స్ కిడ్స్ కు గుర్తిండే పోతుంది.
తెలుగులో జయం సినిమా లోని సాంగ్స్ ఇప్పటికీ జనాల మొబైల్స్, ఇండ్లలో, కార్లలో మోగుతూనే ఉంటాయి. ఆర్పీ పట్నాయక్ అంతలా మైమరిపించే మ్యూజిక్ అందించాడు. సునీల్ శెట్టి కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈ సినిమా నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి నితిన్ ట్విటర్ లో పోస్టు చేశాడు. అప్పుడే జయం సినిమాకు 22 ఏళ్లు పూర్తయ్యాయి. నిజంగా నమ్మశక్యంగా లేదు. డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెప్పాడు.
ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత కొడుకు గోపిచంద్ విలన్ గా నటించాడు. హస్తం చేయి గుర్తు అనే కామెడీ గానీ, హిరోయిన్ పట్టీలతో హిరోను పిలిచే విధానం ఇలా అన్ని అపూరూపలే. చెప్పాలంటే అలాంటి మూవీ అప్పటి వరకు తెలుగులో రాలేదు. దీంతో తెలుగు ఫ్యాన్స్ విపరీతంగా థియేటర్లకు పోటెత్తారు. దీంతో సినిమా 100 రోజులు ఆడి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో అదరగొట్టింది.
రైల్వే స్టేషన్, కాలేజీ వెళ్లే యూత్, శృంగార తార షకీలను చూపించిన విధానం.. హిరో హిరోయిన్ మధ్య ప్రేమ.. విలన్ గోపిచంద్ యాక్షన్, ఒక స్వీట్ లవ్ స్టోరీ.. ఇలా అన్ని సీన్లు ప్రేక్షకుల మనసును దోచేస్తాయి. అలాంటి మూవీ వచ్చి 22 ఏళ్లు అవుతుందంటే ప్రేక్షకులు కూడా నమ్మలేకపోతున్నారు. కొన్ని సినిమాలు వస్తాయి.. వెళ్లిపోతాయి.. చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రాల్లో ‘జయం’ సినిమా ముందుంటుంది.