Amalapal : అమలాపాల్ తెలుగుతోపాటు తమిళ్, మలయాల, కన్నడ మూవీ ల్లో నటించి ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్ .
అయితే తాజాగా ఓ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఎర్నాకులంలోని కాలేజీకి వెళ్ళింది.కానీ ఆమె వేసుకున్న డ్రెస్ బాగా లేకపోవడంతో. నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాలేజీకి వెళ్లేటప్పుడు పొట్టి డ్రెస్ వేసుకొని వెళ్లడం ఏంటి అని విమర్శిస్తున్నారు.
సభ్య సమాజంలో చిన్న పిల్లలుగాని యూత్ గాని సినిమా తారలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారు వేసుకునే డ్రెస్సులు కానీ వారు చేసే నటనను అనుకరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో మూవీ ఆర్టిస్టులకు హీరో హీరోయిన్లకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు వారిని ఫాలో అవుతుంటారు. వారు వేసుకునే డ్రెస్ ఇతర విధానాలను పాటించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు.
ముఖ్యంగా కర్తవ్యం సినిమాలో విజయశాంతి అప్పట్లో చేసిన రోల్ చూసి చాలామంది యువతులు పోలీస్ ఆఫీసర్లు కావాలని అనుకున్నారు. అదే విధంగా ప్రయత్నాలు చేసి పోలీసులుగా మారిన వారు కూడా ఉన్నారు. చిరంజీవి లాంటి గొప్ప గొప్ప హీరో గా మార్చిన చాలెంజ్ సినిమాను చూసి ఎంతోమంది జీవితాన్ని చాలెంజ్ గా తీసుకొని ఆ విధంగా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. సినిమాలు అనగానే చాలామంది వాటిని ఆదర్శంగా తీసుకుంటారు.
అందులో నీ నటీనటుల ఆహా భావాలు వారు చేసే క్యారెక్టర్లు వారు వేసుకునే డ్రెస్సులు అన్నిటిని ఫాలో కావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొంతమంది హీరో హీరోయిన్లు వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాలేజీకి ప్రమోషన్లకు వెళ్లినప్పుడు ఇతర ఈవెంట్లకు వెళ్ళినప్పుడు వారు వేసుకునే డ్రెస్సులు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటున్నాయి.
యువకులు అలాంటి వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆలోచించాలి.ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ప్రమోషన్లకు రావడం వల్ల ఇంప్రెషన్ పోతుందని అంటున్నారు.కానీ అమలాపాల్ మాత్రం తాను అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు కంఫర్ట్ గానే ఉందని చెప్పి మరి వివాదాన్ని కొని తెచ్చుకుంది.