IT Serve Synergy 2024 : లాస్ వేగాస్ లో అట్టహాసంగా ఐటీ సర్వ్ సైనర్జీ 2024.. హాజరు కాబోతున్న మంత్రి లోకేష్,  డాక్టర్ జై గారు

IT Serve Synergy 2024

IT Serve Synergy 2024, Dr. Jai Garu

IT Serve Synergy 2024 : అమెరికాలోని లాస్ వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో అక్టోబర్ 29, 30తేదీల్లో ఐటీ సర్వ్ సైనర్జీ 2024 వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సినర్జీలో ఐటీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాబోయే సవాళ్లు, అవకాశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు తెలుగు సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో లోకేష్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పలు మల్టినేషనల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే మంత్రి లోకేష్ పర్యటన ఉద్దేశం. ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి మూడు వేల చిన్న & మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. ఈ సదస్సులో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారు, మరి కొందరు ప్రవాసాంధ్రులు పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన ఫోటో గ్యాలరీ వీడియోలను కింద చూడవచ్చు.

లాస్ వేగాస్ లో ఐటీ సర్వ్ సైనర్జీ 2024.. హాజరైన సెలబ్రిటీలతో డాక్టర్ జైగారు..

అమెరికాలోని లాస్ వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో అక్టోబర్ 29, 30తేదీల్లో ఐటీ సర్వ్ సైనర్జీ 2024 వేడుక అట్టహాసంగా జరుగుతోంది.ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి మూడు వేల చిన్న & మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఐటీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాబోయే సవాళ్లు అధిగమించేందుకు పారిశ్రామిక వేత్తలంగా సమాలోచనలు చేస్తారు. ఈ ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో టాలెంటెడ్ పారిశ్రామికవేత్తలు, క్రియేటర్స్ ను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. ఈ సదస్సులో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంలో సదస్సుకు హాజరైన పలువురు సెలబ్రిటీలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి, మోడల్ ఏంజెల్ కుమార్ తో కలిసి ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటో గ్యాలరీను కింద చూడవచ్చు.

TAGS