Minister Ashwini Vaishnav : ఐటీ మ్యాన్.. చంద్రబాబు: కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్

Minister Ashwini Vaishnav
Union Minister Ashwini Vaishnav : అసలైన ఐటీ మ్యాన్ ఏపీ సీఎం చంద్రబాబేనని రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వ్యవహారాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలోని రైల్ భవన్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇంతమందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిపి ఐటీ శాఖ మంత్రి అనిపించుకున్నారని అశ్వినీవైష్ణవ్ ను ప్రశంసించారు. అందుకు ఆయన బదులిస్తూ ‘నేను కాదు.. నిజమైన ఐటీమ్యాన్ మన ముందన్న సీఎం చంద్రబాబే’ అని వ్యాఖ్యానించారు.