SmartPhone Tips : స్మార్ట్ ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి ఒక్క అడుగు బయట వేయలేని పరిస్థితి. ఏం చేయలన్నా.. ఎటు వెళ్లాలన్నా.. మొబైల్ చేతిలో ఉండాల్సిందే. ఇక ఇండియాలో డిజిటల్ మనీ చేతికందిన తర్వాత ఇది మరింత అవసరంగా మరింది. రూపాయి ఖర్చు పెట్టాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే ఒక్క డిజిటల్ మనీ కోసమే కాకుండా చాలా విషయాలకు ఇది ఎంతో అవసరం అవుతుంది. అలాంటి మొబైల్ స్లో, హ్యాంగ్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ స్లో, హ్యంగ్ అయితే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. మెమోరీని డిలీట్ చేస్తాం.. లేదంటే యాప్స్ ను కూడ డిలీట్ చేస్తాం. ఇలా చేస్తే ఫోన్ కొంచెం స్పీడ్ అవుతుంది కావచ్చు. కానీ మళ్లీ యాప్స్ కావాలంటే ఇన్ స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మొదట మీ ఫోన్ ప్లే స్టోర్ ను ఓపెన్ చేసుకోండి. పైన రైట్ సైడ్ అకౌంట్ పై క్లిక్ చేయండి. అక్కడ కింద సెట్టింగ్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. అక్కడ జనరల్ పై క్లిక్ చేయండి. అక్కడ కింద నుంచి రెండు, లేదా మూడో ఆప్షన్ ఆటో మెటిక్ ఆర్చీవ్ యాప్స్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక మీ ఫోన్ పరుగులు పెడుతుంది.
ఆటోమెటిక్ ఆర్చీవ్ యాప్స్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ లో మీరు చాల రోజులుగా వడని యాప్స్ ఆర్చీవ్ లోకి వెళ్తాయి. తిరిగి వాడినప్పుడే వాడుకలోకి వస్తాయి. ఇక వీటితో ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫోన్ స్పీడ్ అవుతుంది.