WPL 2024 : అత్యంత ఉత్సాహ భరితంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మార్చి 17న ముగిసింది. ఈ సీజన్ లో ఆర్సీబీ (Royal Challengers Banglugu) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఆర్సీబీకి తొలి టైటిల్. ఈ విజయాన్ని అందించినందుకు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ హర్షం వ్యక్తం చేసింది . RCB గ్లోరీ సీజన్‌లో పెర్రీ కీలక పాత్ర పోషించింది. ఆమె అగ్ర భాగాన నిలబడి మ్యాచ్ ను మలుపుతిప్పిందనే చెప్పాలి. ఫైనల్స్ లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. తక్కువ స్కోర్ తోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
పెర్రీ ఫైనల్‌లో తక్కువ స్కోరే చేసినా పూర్తి సీజన్ లో ఆమె అత్యంత ప్రతిభ కనబరించింది. ఆర్సీబీకి మరో కీలక నాక్ ఆడింది. ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ (పురుషులు)ను తలపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కొనసాగిన ఈ ఫైనల్స్ లో ఆర్సీబీకి భారీ మద్దతు అందింది.
ఈ తుది పోరులో RCB బౌలర్లు జట్టు విజయానికి పునాది వేశారు. సోఫీ మోలినిక్స్ ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆదిలోనే కట్టడి చేసింది. ఆ ఓవర్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ రాను రాను పట్టాలు తప్పింది. క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.
పెర్రీ బౌలర్లు ముఖ్యంగా మోల్లినెక్స్ మరియు శ్రేయాంకలను పెద్ద వేదికపై వారి అద్భుతమైన ప్రదర్శనకు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల కల నెరవేర్చిన పెర్రీకి గుడి కట్టినా తప్పులేదని చాలా మంది నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఆమెను కొనియాడారు.